Salaar : ట్రైలర్ తోనే రికార్డ్స్ బద్దలు కొట్టిన సలార్ …
ట్రైలరే ఈ రేంజ్ లో ఉంటె సినిమా ఇంకా ఏ రేంజ్ లో ఉండబోతుందో అని యావత్ అభిమానులే కాదు సినీ లవర్స్ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు
- By Sudheer Published Date - 07:13 PM, Sat - 2 December 23
సలార్ (Salaar ) మూవీ ఎలా ఉండబోతుందో ..జస్ట్ ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది..ఈ ట్రైలర్ చాలు మరోసారి టాలీవుడ్ రికార్డ్స్ బద్దలు కావడానికి..ప్రభాస్ (Prabhas) ను ఎలా అయితే అభిమానులు చూడాలని అనుకుంటున్నారో అంతకు మించి ప్రశాంత్ (Prashanth Neel) సలార్ లో చూపించబోతున్నట్లు స్పష్టంగా అర్ధం అయ్యింది. నిన్నటి నుండి ఎక్కడ చూసిన సలార్ ట్రైలర్ గురించే మాట్లాడుకుంటున్నారు. గత కొద్దీ నెలలుగా ఈ ట్రైలర్ కోసం ఆసక్తి గా అభిమానులు ఎదురుచూస్తుండడం..ట్రైలర్ వారి ఆసక్తి కి తగ్గట్లే ఉండడం తో యూట్యూబ్ లో రికార్డ్స్ వ్యూస్ సాధించి వార్తల్లో నిలిచింది.
We’re now on WhatsApp. Click to Join.
ఫ్రెండ్షిప్.. రాజకీయం.. కుళ్ళు.. కుతంత్రాలతో సినిమా ఉండబోతుందని ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది. ‘నీకోసం ఎరైనా అవుతా.. సొరైనా అవుతా.. నీ ఒక్కడికోసం.. నువ్వెప్పుడు పిలిచినా నేనిక్కడికొస్తా.. అంటూ పవర్ఫుల్ డైలాగ్ ప్రభాస్ అభిమానులకు గూజ్బంబ్స్ తెప్పించింది. ఇక ట్రైలర్ విడుదల కొద్ది గంటల్లోనే యూట్యూబ్లో “100 మిలియన్ల మార్క్ సాధించి రికార్డులను బద్దలు కొట్టింది. ట్రైలరే ఈ రేంజ్ లో ఉంటె సినిమా ఇంకా ఏ రేంజ్ లో ఉండబోతుందో అని యావత్ అభిమానులే కాదు సినీ లవర్స్ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ లో ప్రభాస్ జోడిగా శ్రుతి హాసన్ నటిస్తుండగా.. మలయాళీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు కీలకపాత్రలు పోషిస్తున్నారు. డిసెంబర్ 22 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Read Also : Animal: యానిమల్ సినిమా బ్యూటీ బ్యాక్ గ్రౌండ్ గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే?
Related News
Salaar 2 : ప్రభాస్ ‘సలార్ 2’లోకి మరో మలయాళ స్టార్ నటుడు ఎంట్రీ.. ఏ పాత్ర కోసం..?
ప్రభాస్ 'సలార్ 2'లోకి మరో మలయాళ స్టార్ నటుడు ఎంట్రీ ఇవ్వబోతున్నారట. ఇంతకీ ఎవరు ఆ నటుడు..? ఏ పాత్ర కోసం..?