Animal: యానిమల్ సినిమా బ్యూటీ బ్యాక్ గ్రౌండ్ గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే?
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రష్మిక మందన, రణ్ బీర్ కపూర్ కలిసి నటించిన తాజా చిత్రం యానిమల్. కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా తాజాగా భారీ
- By Nakshatra Published Date - 06:54 PM, Sat - 2 December 23
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రష్మిక మందన, రణ్ బీర్ కపూర్ కలిసి నటించిన తాజా చిత్రం యానిమల్. కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా తాజాగా భారీ అంచనాల నడుమ డిసెంబర్ 1న థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైన విషయం తెలిసిందే. తాజాగా విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ని అందుకోవడంతోపాటు కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది. అయితే ఒక వర్గం ప్రేక్షకులు ఈ సినిమా సూపర్ హిట్ అంటుండగా మరికొందరు మాత్రం సినిమా మాకు నచ్చలేదు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఆ సంగతి పక్కన పెడితే ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక కంటే ఒక ముద్దుగుమ్మ సినిమాలో బాగా హైలైట్ అయింది.
కిస్సులు హగ్గులు రొమాన్స్ తో బాగా రెచ్చిపోయింది. ఇంతకీ ఆమె ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి అన్న వివరాల్లోకి వెళితే.. యానిమల్ సినిమా మొదలైన 15 నిమిషాల్లోనే రణ్‌బీర్-రష్మిక పాత్రలకు పెళ్లయిపోతుంది. దీంతో హీరోయిన్ రష్మిక పాత్రకు గ్లామర్ చూపించడానికి కుదరదు. దీంతో ఇంటర్వెల్ తర్వాత జోయా అనే పాత్ర ఎంటర్ అవుతుంది. ఈ క్యారెక్టర్ లో బాలీవుడ్ నటి తృప్తి దిమ్రి నటించింది. విలన్ గ్యాంగ్‌కి చెందిన ఈమె సీక్రెట్ గా రహస్యాలు తెలుసుకోవడానికి హీరో దగ్గరికి వస్తుంది. తెలియకుండానే అతడితో ప్రేమలో పడిపోతుంది. దీంతో ఈ రెండు పాత్రల మధ్య రొమాన్స్ దగ్గర కిస్సులు ఒకే రేంజులో ఉంటాయి. ఓ సీన్లో అయితే బెడ్‌పై నగ్నంగా కనిపించే సీన్ ఒకటి ఉంటుంది.
ఇందులో రణ్‌బీర్, తృప్తి దిమ్రి రెచ్చిపోయారు. ఒకే రకంగా చెప్పాలంటే రష్మిక పాత్ర కంటే తృప్తి పాత్రనే ఎక్కువగా హైలైట్ అయిందని చెప్పవచ్చు. ఇకపోతే ఆమె బ్యాగ్రౌండ్ విషయానికి వస్తే.. ఈమె అసలు పేరు లైలా తృప్తి దిమ్రి. ఓటీటీ అభిమానులు మాత్రం ఈ బ్యూటీని బుల్బుల్ అని ముద్దుగా పిలుస్తారు. ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగ్ లో తృప్తి పుట్టింది. 2017లో పోస్టర్ బాయ్స్ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. లైలా మజ్ను, బుల్ బుల్ లాంటి సినిమాలు చేసింది. ఇకపోతే బుల్ బుల్ మూవీ ప్రొడ్యూసర్ కర్నేశ్తో ఈమె డేటింగ్లో ఉందని రూమర్స్ ఉన్నాయి. ఇకపోతే సందీప్ రెడ్డి వంగా తీసిన అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాల్లో హీరోయిన్ల పాత్రల కంటే సెకండాఫ్‌లో కనిపించిన బ్యూటీస్ అనుకోని విధంగా హైలైట్ కావడం విశేషం.
Related News
Tripti Dimri : త్రిప్తి తెలుగు సినిమాలకు నో అనేస్తుందా.. కారణాలు ఏంటి..?
Tripti Dimri బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ త్రిప్తి డిమ్రికి వరుస అవకాశాలు వస్తున్నాయి. సందీప్ రెడ్డి డైరెక్షన్ లో రణ్ బీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్