Salaar Radha Rajamannar Aka Sriya Reddy : రాధా రాజమన్నార్ కు పెరుగుతున్న డిమాండ్.. శ్రీయా రెడ్డి కి క్యూ కడుతున్న ఆఫర్లు..!
Salaar Radha Rajamannar Aka Sriya Reddy అప్పట్లో తమిళ సినిమాలతో అలరించిన శ్రీయా రెడ్డి ఈమధ్య మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చారు. సలార్ లో రాధా రాజమన్నార్ పాత్రలో ఆమె అభినయం అందరిని
- Author : Ramesh
Date : 02-02-2024 - 9:56 IST
Published By : Hashtagu Telugu Desk
Salaar Radha Rajamannar Aka Sriya Reddy అప్పట్లో తమిళ సినిమాలతో అలరించిన శ్రీయా రెడ్డి ఈమధ్య మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చారు. సలార్ లో రాధా రాజమన్నార్ పాత్రలో ఆమె అభినయం అందరిని అలరించింది. ప్రభాస్ సలార్ లో లేడీ విలన్ గా శ్రీయా రెడ్డి ఉన్న కాసేపు అయినా కూడా మెప్పించింది. సలార్ లో ఆమె పాత్ర చూశాక మరో లేడీ విలన్ దొరికేసిందని ఫిక్స్ అయ్యారు. ఇక సలార్ తో పాటుగా పవన్ కళ్యాణ్ ఓజీ లో కూడా ఆమె నటిస్తుంది.
ఒకేసారి శ్రీయా రెడ్డి కి రెండు బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్ట్స్ అది కూడా టాలీవుడ్ నుంచి రావడం గొప్ప విషయం. రీసెంట్ గా ఇలానే కోలీవుడ్ నుంచి వచ్చి ఇక్కడ సపోర్టింగ్ రోల్స్, నెగిటివ్ రోల్స్ చేస్తూ మెప్పిస్తుంది వరలక్ష్మి శరత్ కుమార్ ఇప్పుడు ఆమె ని ఛాలెంజ్ చేస్తూ శ్రీయా రెడ్డి కూడా వరుస ఆఫర్లు అందుకుంటుంది.
తమిళంలో ఏమో కానీ అమ్మడికి తెలుగులో మంచి పాపులారిటీ వస్తుంది. పవన్ ఓజీ లో కూడా తనది ప్రాముఖ్యత కలిగిన పాత్ర అని తెలుస్తుంది. సలార్ 1 తో పాటుగా ఓజీ సలార్ 2 లో కూడా ఆమె పాత్రలు బాగా వచ్చేలా ఉన్నాయి. సో తప్పకుండా తెలుగు తెర మీద శ్రీయా రెడ్డి మరిన్ని సినిమాలు చేసేలా ఉందని చెప్పొచ్చు.