HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Saiyaara Collections

Saiyaara : వామ్మో ఇది పేరుకే చిన్న సినిమా…బాక్స్ ఆఫీస్ వద్ద మెగా బ్లాక్ బస్టర్

Saiyaara : మొదట 8000 స్క్రీన్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం, పాజిటివ్ రెస్పాన్స్‌తో 10000 స్క్రీన్లకు పెరిగింది. 60 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం తొలి రోజే 21.5 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి

  • By Sudheer Published Date - 03:06 PM, Tue - 29 July 25
  • daily-hunt
Saiyaara Collectionis
Saiyaara Collectionis

ఈ మధ్య బాలీవుడ్‌లో స్టార్స్ సినిమాలు వరుసగా ఫెయిలవుతూ వస్తుండగా, ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఓ చిన్న సినిమా “సైయారా” (Saiyaara ) అద్భుత విజయాన్ని సాధించింది. యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మాణంలో, మోహిత్ సూరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ఆహాన్ పాండే హీరోగా, అనీత్ పడ్డా హీరోయిన్‌గా నటించారు. జూలై 18న విడుదలైన ఈ చిత్రం, విడుదలైన మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుని బాక్స్ ఆఫీస్ వద్ద బ్రహ్మాడమైన వసూళ్లను సాధిస్తోంది. చిన్న చిత్రంగా వచ్చి బాలీవుడ్‌కు కొత్త ఊపిరిని ఇచ్చిందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఈ సినిమాలో భారీ బడ్జెట్‌దారుల సినిమాలా గ్రాఫిక్స్, ఫైట్లు ఉండకపోయినా.. బలమైన కథ, గొప్ప ఎమోషన్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కథ సింపుల్‌గా ఉన్నా, స్క్రీన్‌ప్లేలో నూతనత, భావోద్వేగాలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ప్రేక్షకుల హృదయాలను తాకింది. ముఖ్యంగా హీరో-హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ, లవ్ ప్రపోజ్ సీన్‌కు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. సోషల్ మీడియాలో నెటిజన్లు “ఆ ఒక్క సీన్ కోసమే సినిమా చూడొచ్చు” అంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

Tragedy : యూపీలో భర్తపై భార్య దారుణం.. భర్త సజీవదహనం

మొదట 8000 స్క్రీన్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం, పాజిటివ్ రెస్పాన్స్‌తో 10000 స్క్రీన్లకు పెరిగింది. 60 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం తొలి రోజే 21.5 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి, ప్రస్తుతం వరల్డ్‌వైడ్‌గా 260 కోట్ల గ్రాస్‌ను అందుకుంది. ఈ రేట్ చూస్తే త్వరలోనే 300 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశముందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ విజయంతో బాలీవుడ్‌కి మళ్లీ పూర్వ వైభవం తిరిగొస్తుందన్న నమ్మకం కనిపిస్తోంది.

కథ విషయానికొస్తే.. క్రిష్ అనే యువకుడికి సంగీతం పట్ల అపారమైన మక్కువ ఉంటుంది. అతడి కల గొప్ప సంగీత దర్శకుడిగా ఎదగడం. ఈ క్రమంలో జర్నలిస్టు వాణి బాత్రాతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారుతుంది. అదే సమయంలో వాణిని మోసం చేసిన మహేశ్ మళ్లీ ఆమె జీవితంలోకి వస్తాడు. ముగింపులో వాణి ఎవరిని పెళ్లి చేసుకుంది? క్రిష్ తన కలను నెరవేర్చాడా? అన్నదే కథ. ఇక ఈ చిత్రంపై సుకుమార్, మహేశ్ బాబు వంటి టాప్ సెలెబ్రిటీలు ప్రశంసలు కురిపించడంతో తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • mahesh babu
  • Saiyaara
  • Saiyaara box office
  • Saiyaara collections
  • Saiyaara collections report
  • Saiyaara movie
  • sukumar tweets

Related News

    Latest News

    • Rayalaseema : రాయలసీమలో ఉపాధి అవకాశాలు పెరిగాయి – మోదీ

    • Silver Price : దీపావళి తర్వాత సిల్వర్ రేట్ తగ్గుతుందా?

    • AI Vizag : AIకు ఏపీ తొలి గమ్యస్థానంగా మారనుంది – మోదీ

    • Fake Votes : కేటీఆర్ చెప్పింది అంత అబద్దమే..దొంగ ఓట్లు సృష్టిచిందే బిఆర్ఎస్ పార్టీ

    • Telangana Cabinet Meeting : క్యాబినెట్ సమావేశానికి కొండా సురేఖ గైర్హాజరు

    Trending News

      • Chandrababu : కర్నూలు : ”సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్” బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగం

      • Infosys : ఉద్యోగులకు ఇన్ఫోసిస్ అదిరిపోయే శుభవార్త..!

      • PM Modi AP Tour LIVE: ప్రధాని మోదీ లైవ్ అప్డేట్స్

      • Sai Dharam Tej : మేన‌ల్లుడు సాయి దుర్గా తేజ్ బర్త్‌డే.. మామ ప‌వ‌న్ క‌ల్యాణ్ విషెస్

      • Nobel Peace Prize 2025 : డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్ ?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd