Saira Banu : ప్రపంచంలోని గొప్ప వ్యక్తుల్లో రెహమాన్ ఒకరు.. ఆయనపై విమర్శలొద్దు : సైరా బాను
ప్రస్తుతం నేను ముంబైలో ట్రీట్‌మెంట్ చేయించుకుంటున్నాను. త్వరలోనే చెన్నైకి తిరిగి వస్తాను’’ అని సైరా బాను(Saira Banu) స్పష్టం చేశారు.
- By Pasha Published Date - 03:42 PM, Sun - 24 November 24

Saira Banu : విఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ , ఆయన సతీమణి సైరా బాను తమ మూడు దశాబ్దాల వైవాహిక బంధానికి ఇటీవలే స్వస్తి పలికారు. అయితే వీరు విడిపోవడంపై సోషల్ మీడియా వేదికగా కొందరు ఇష్టానుసారంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. పలువురు ఏఆర్ రెహమాన్‌ను తప్పుపడుతూ కథనాలు వండివారుస్తున్నారు. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఇటీవలే స్వయంగా ఏఆర్ రెహమాన్ వార్నింగ్ ఇచ్చారు. తన కుటుంబ జీవితంలోని విషయాలపై ఇతరుల జోక్యాన్ని సహించేది లేదని ఆయన తేల్చి చెప్పారు. ఈ తరుణంలో ఏఆర్ రెహమాన్‌కు మద్దతుగా సైరా బాను కీలక ప్రకటన విడుదల చేశారు.
Also Read :Adani Group : అమెరికాలో అదానీ గ్రూపుపై కేసులు.. భారత సుప్రీంకోర్టుకు చేరిన వ్యవహారం
‘‘గత కొన్ని నెలలుగా నా ఆరోగ్యం బాగా లేదు. అందుకే ఆయనకు దూరంగా ఉండాలని అనుకుంటున్నా. ప్రస్తుతం నేను ముంబైలో ట్రీట్‌మెంట్ చేయించుకుంటున్నాను. త్వరలోనే చెన్నైకి తిరిగి వస్తాను’’ అని సైరా బాను(Saira Banu) స్పష్టం చేశారు. ‘‘మీడియాను నేను కోరేది ఒక్కటే. దయచేసి ఆయన గురించి ఎలాంటి చెడు ప్రచారం చేయొద్దు. ఆయన చాలా మంచి మనసున్న వ్యక్తి. ప్రపంచంలోని గొప్ప వ్యక్తుల్లో ఆయన ఒకరు. ఆయనపై విమర్శలు చేయడం ఇకనైనా మానండి. రెహమాన్ పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించవద్దు’’ అని సైరా బాను తెలిపారు. ‘‘మేం ఇంకా అధికారికంగా ఏమీ ప్రకటించలేదు. ఈ క్లిష్ట సమయంలో మా వ్యక్తిగత గోపత్యకు భంగం కలిగించొద్దు’’ అని ఆమె కోరారు. తన తండ్రి గురించి తప్పుడు కథనాలు చూస్తుంటే ఎంతో బాధగా ఉందని రెహమాన్ తనయుడు అమీన్ ఇటీవలే పోస్ట్ పెట్టాడు.
Also Read :Mana Desam : ఎన్‌టీఆర్ ‘మన దేశం‘ మూవీకి 75 ఏళ్లు.. నారా భువనేశ్వరి ఎమోషనల్ ట్వీట్
ఏఆర్ రెహమాన్, సైరా బాను పెళ్లి ఇలా జరిగింది..
సైరా బాను 1973 డిసెంబరులో గుజరాత్‌లోని కచ్ ప్రాంతంలో ఒక ఎగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. పెళ్లి జరిగే సమయానికి ఆమె వయసులో ఏఆర్ రెహమాన్ కంటే ఏడేళ్లు చిన్నది. సామాజిక సేవా కార్యక్రమాలు, విద్యారంగం, ఆరోగ్యరంగ సేవా కార్యక్రమాలు చేయడం అంటే సైరా బానుకు చాలా ఇష్టం. ఏఆర్ రెహమాన్, సైరా బానులది పెద్దలు కుదిర్చిన వివాహం. ఒకసారి ఏఆర్ రెహమాన్ తల్లి కరీమా బేగం, సోదరి ఫాతిమా కలిసి సమీపంలోని ఒక దర్గాకు వెళ్లారు. అక్కడే తొలిసారి వాళ్లు సైరా బానును చూశారు. అక్కడే సైరా బానుతో వాళ్లు మాట్లాడారు. 1995 జనవరి 6న ఏఆర్ రెహమాన్ బర్త్ డే వేళ సైరా బానుతో పరిచయం ఏర్పడింది. అనంతరం ఇద్దరూ ఫోనులో టచ్‌లో ఉండేవాళ్లు. ఈక్రమంలోనే తనను పెళ్లి చేసుకొమ్మని రెహమాన్ ప్రపోజ్ చేశారు. అనంతరం రెహమాన్ కుటుంబీకులు వెళ్లి.. సైరాబాను కుటుంబీకులతో మాట్లాడి పెళ్లిని ఫిక్స్ చేయించారు.