NTR Devara: ఎన్టీఆర్ భార్యగా సాయిపల్లవి? చిత్రయూనిట్ క్లారిటీతో ఫ్యాన్స్ నిరాశ
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తాజా చిత్ర దేవర ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరుపుకుంటుంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న
- By Praveen Aluthuru Published Date - 05:18 PM, Sat - 1 July 23

NTR Devara: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తాజా చిత్రం దేవర ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరుపుకుంటుంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే దేవర సినిమాలో టాలెంటెడ్ నటి సాయిపల్లవి కీ రోల్ లో నటించనున్నట్టు కొంతకాలంగా వార్తలు వినిపించాయి. ఈ చిత్రంలో ఎన్టీఆర్ భార్యగా సాయిపల్లవి నటిస్తుంది అన్న కామెంట్స్ ప్రముఖంగా వినిపించాయి. అయితే ఈ వార్తల నేపథ్యంలో చిత్రబృందం స్పందించింది.
ఎన్టీఆర్, సాయిపల్లవి కాంబోని చూడాలని యంగ్ టైగర్ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వీరిద్దరి డాన్స్ కి థియేటర్లో పూనకాలే అనుకున్నారు. కానీ ఈ సినిమాలో సాయిపల్లవి నటించడం లేదని చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది. దేవర సినిమాలో సాయిపల్లవి ఆప్షన్ ఏ లేదని తేల్చేసింది. దీంతో ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. ఇద్దరి అద్భుతమైన నటనను చూసేందుకు ఆసక్తి చూపించిన యంగ్ టైగర్ ఫ్యాన్స్ కి చిత్ర యూనిట్ షాక్ ఇస్తూ ప్రకటన చేసింది.
ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో దేవరపై భారీ హైప్ క్రియేట్ అయింది. మరీ ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ ద్వారా హిందీ పరిశ్రమలో ఎన్టీఆర్ ఫ్యాన్ బేస్ బాగా పెరిగింది. దీంతో ఈ సినిమాని కొరటాల ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు బాలీవుడ్ స్టార్స్ సైఫ్ అలీ ఖాన్ మరియు జాన్వీ కపూర్ ఈ సినిమాలో నటిస్తుండటంతో సినిమా ఏ రేంజిలో ఉంటుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read More: Rajamouli: క్రీడారంగంలోకి జక్కన్న.. ISBC చైర్మన్ గా రాజమౌళి