Sai Pallavi: పుష్ప-2లో సాయిపల్లవి ఉందా? ఇదిగో క్లారిటీ వచ్చేసింది
లేడీ పవర్ స్టార్‌గా పేరు తెచ్చుకుంది అందాల బొమ్మ సాయిపల్లవి. తన నటన, డ్యాన్సులతో ఎంతోమంది ప్రేక్షకులను తక్కువకాలంలోనే సంపాదించుకుంది. మిగతా హీరోయిన్ల కంటే విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంటోంది.
- By Anshu Published Date - 03:04 PM, Fri - 31 March 23

Sai Pallavi: లేడీ పవర్ స్టార్‌గా పేరు తెచ్చుకుంది అందాల బొమ్మ సాయిపల్లవి. తన నటన, డ్యాన్సులతో ఎంతోమంది ప్రేక్షకులను తక్కువకాలంలోనే సంపాదించుకుంది. మిగతా హీరోయిన్ల కంటే విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంటోంది. హీరోయిన్లు నటనకు ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వరు. సినిమాల్లో హీరోయిన్లను గ్లామరింగ్ కోసం ఎక్కువగా నిర్మాతలు, డైరెక్టర్లు ఉపయోగించుకుంటూ ఉంటారు. దీంతో హీరోయిన్లను నటకు స్కోప్ ఉండదు.
కానీ సాయిపల్లవి నటించిన ప్రతీ సినిమాలోనూ ఆమె క్యారెక్టర్‌కు ప్రాధాన్యం ఉంటుంది. నటనకు ప్రయారిటీ ఉన్న సినిమాలను మాత్రమే ఈ అమ్మడు ఎంచుకుంటూ తన నటనతో అందరినీ అలరిస్తోంది. అలాగే హీరోలకు పోటీగా డ్యాన్స్‌లు చేస్తూ సాయిపల్లవి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. హీరోలకు పోటీగా సినిమాల్లో యాక్టింగ్ చేస్తోంది. దీంతో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా సాయిపల్లవి ఎదిగింది.
అయితే సాయిపల్లవి పుష్ప-2 సినిమాలో నటిస్తుందనే ప్రచారం గత కొంతకాలంగా సినీ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై తాజాగా సాయిపల్లవి క్లారిటీ ఇచ్చింది. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈ బ్యూటీ.. పుష్ప-2లో తాను నటించడం లేదని, తనకు ఆఫర్ రాలేదని చెప్పుకొచ్చింది. తనను పుష్ప-2 సినిమా కోసం ఎవరూ ఇప్పటివరకు సంప్రదించలేదని, కానీ అలాంటి సినిమాలో తాను ఉన్నానంటూ చెబుతున్నందుకు చాలా ఆనందంగా ఉందని పేర్కొంది.
అయితే పుష్ప-2లో రష్మిక పాత్ర ఎక్కువగా ఉండదని, రష్మిక పాత్ర చనిపోతుందని ప్రచారం జరుగుతోంది. దీంతో ఆమె స్థానంలో ఇంకో హీరోయిన్ గా సాయిపల్లవి నటించనుందనే ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత సమంత కూడా ఇందులో హీరోయిన్‌గా నటించనుందనే ప్రచారం జరుగుతోంది. సాయిపల్లవి తాను నటించడం లేదని క్లారిటీ ఇచ్చింది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప పార్ట్ 1 సూపర్ హిట్ అయింది. దీంతో పుష్ప2 కోసం సినీ ప్రేక్షకులు ఎదరుచూస్తున్నారు.