Robinhood : నితిన్ ‘రాబిన్ హుడ్’ పబ్లిక్ టాక్
Robinhood : వెంకీ కుడుముల కామెడీ టైమింగ్ ఈ సినిమాకు పెద్ద ప్లస్ అవుతుందని, అయితే కథలో కొత్తదనం కొద్దిగా మిస్సయ్యిందని అంటున్నారు
- By Sudheer Published Date - 11:03 AM, Fri - 28 March 25

వెంకీ కుడుముల (Venky Kudumula) దర్శకత్వంలో నితిన్, శ్రీలీల (Nithin – Sreeleela) జంటగా నటించిన ‘రాబిన్ హుడ్’ (Robinhood)సినిమా నేడు థియేటర్లలో విడుదలైంది. వెంకీ కుడుముల గతంలో ‘ఛలో’, ‘భీష్మ’ చిత్రాలతో హిట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. కానీ చిరంజీవి కోసం కథ సిద్ధం చేసేందుకు చాల టైం తీసుకోని ..చివరకు ఆ ప్రాజెక్ట్ రద్దు అయ్యేసరికి మళ్లీ నితిన్‌తో ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించాడు. ఈ సినిమాలో కామెడీ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని ట్రైలర్ నుంచే అంచనాలు పెరిగాయి. ఇక ఈరోజు వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాగా సోషల్ మీడియా లో సినిమా ఎలా ఉందనేది అభిమానులు , నెటిజనులు షేర్ చేస్తున్నారు.
Surya Grahanam 2025 : రేపు సూర్యగ్రహణం
ఫస్ట్ హాఫ్ చాలా బాగుందనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా కామెడీ, నితిన్ పెర్ఫార్మెన్స్, వెంకీ కుడుముల కామెడీ పంచ్‌లు బాగా వర్కౌట్ అయ్యాయి. అయితే పాటలు, ఇంటర్వెల్ సీన్ ఆశించినంత స్థాయిలో ఆకట్టుకోలేదని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ ఓకే అనిపించినా, సెకండ్ హాఫ్ పెద్దగా లేదని , శ్రీలీల పాత్ర కూడా పెద్దగా ఆకట్టుకునేలా లేదని అంటున్నారు.
Thyroid: థైరాయిడ్ వల్ల బరువు పెరుగుతున్నారా.. అయితే వెంటనే ఇలా చేయండి.. అస్సలు బరువు పెరగరు!
ఓవరాల్‌గా డీసెంట్ ఎంటర్టైనర్‌గా నిలుస్తుందని కొందరు అంటుండగా, మరికొంతమంది యావరేజ్ అని తెలుస్తున్నారు. వెంకీ కుడుముల కామెడీ టైమింగ్ ఈ సినిమాకు పెద్ద ప్లస్ అవుతుందని, అయితే కథలో కొత్తదనం కొద్దిగా మిస్సయ్యిందని అంటున్నారు. డేవిడ్ భాయ్ క్యామియో ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ, ఎమోషనల్ పార్ట్ అంతగా కనెక్ట్ కాలేదని అంటున్నారు. ఓవరాల్ గా మాత్రం సినిమాకు మిక్సెడ్ టాక్ నడుస్తుంది.