Surya Grahanam 2025 : రేపు సూర్యగ్రహణం
Surya Grahanam 2025 : ఇటువంటి గ్రహణాల సమయంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఎటువంటి రక్షణ లేకుండా గ్రహణాన్ని చూసేందుకు ప్రయత్నించకూడదని, ప్రత్యేకమైన గ్లాసెస్ లేదా టెలిస్కోపుల ద్వారా మాత్రమే వీక్షించాలని సూచించారు
- By Sudheer Published Date - 10:47 AM, Fri - 28 March 25

ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం (Surya Grahanam 2025) రేపు ఏర్పడనుంది. ఖగోళ శాస్త్రజ్ఞుల అభిప్రాయం ప్రకారం.. ఈ గ్రహణం భారత కాలమానం ప్రకారం రాత్రివేళ సంభవించనుంది. అందువల్ల మనదేశంలో ఇది కనిపించే అవకాశం లేదు. అయితే ప్రపంచంలోని పలు దేశాల్లో ఈ అద్భుత ఖగోళ సంఘటన కనువిందు చేయనుంది. ముఖ్యంగా ఆసియా, ఆఫ్రికా, యూరప్, అట్లాంటిక్ మహాసముద్రం, ఉత్తర మరియు దక్షిణ అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో ఈ గ్రహణాన్ని స్పష్టంగా వీక్షించవచ్చు.
Peddapalli : పెద్దపల్లి జిల్లాలో పరువు హత్య
విశ్వ ఖగోళ పరిశీలన కేంద్రాల ప్రకారం.. అక్కడి కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.20 గంటలకు ఈ గ్రహణం ప్రారంభమవుతుంది. తరువాత కాలక్రమేణా గ్రహణం పురోగమించి సాయంత్రం 4.17 గంటలకు సంపూర్ణ దశకు చేరుకుంటుంది. ఆ తర్వాత క్రమంగా గ్రహణ ప్రభావం తగ్గుతూ సాయంత్రం 6.13 గంటలకు పూర్తిగా ముగుస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. సూర్యుని ఒక భాగాన్ని చంద్రుడు పూర్తిగా కప్పివేసే ఈ గ్రహణం దృశ్యాలను పలు ఖగోళ పరిశోధన సంస్థలు ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి.
Free Bus Scheme: మహిళలకు ఉచిత బస్సు పథకం.. త్వరలోనే అమలు!
ఇటువంటి గ్రహణాల సమయంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఎటువంటి రక్షణ లేకుండా గ్రహణాన్ని చూసేందుకు ప్రయత్నించకూడదని, ప్రత్యేకమైన గ్లాసెస్ లేదా టెలిస్కోపుల ద్వారా మాత్రమే వీక్షించాలని సూచించారు. గ్రహణాల సమయంలో పలు ఆచారాలను అనుసరించే భారతీయ సంప్రదాయాన్ని పరిగణనలోకి తీసుకుంటూ, చాలా మంది భక్తులు ఈ సమయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఖగోళ శాస్త్రపరంగా ఆసక్తిగల వ్యక్తులు ఈ గ్రహణాన్ని ప్రత్యక్ష ప్రసారాల ద్వారా వీక్షించి, ఖగోళ శాస్త్ర విశేషాలను తెలుసుకోవచ్చు.