Rishab Shetty Prabhas : రిషబ్ శెట్టి స్టోరీ.. ప్రభాస్ హీరో.. హోంబలె కాంబో ఫిక్స్..!
Rishab Shetty Prabhas హోంబలె ప్రొడక్షన్స్ ప్రభాస్ తో 3 సినిమాలు అగ్రిమెంట్ చేసుకుంది. సలార్ 2 అందులో ఒకటి కాగా మరో రెండు సినిమాలు
- Author : Ramesh
Date : 09-12-2024 - 3:39 IST
Published By : Hashtagu Telugu Desk
కాంతారా సినిమాతో సెన్సేషనల్ పాన్ ఇండియా హిట్ కొట్టిన రిషబ్ శెట్టి తన నెక్స్ట్ సినిమా కాంతారా ప్రీక్వెల్ లో బిజీగా ఉన్నాడు. ఐతే ఈ క్రమంలో ప్రభాస్ నెక్స్ట్ సినిమాకు రిషబ్ శెట్టి కథ ఇస్తున్నాడని టాక్ నడుస్తుంది. హోంబలె ప్రొడక్షన్స్ ( Hombale Productions) ప్రభాస్ (Prabhas) తో 3 సినిమాలు అగ్రిమెంట్ చేసుకుంది. సలార్ 2 అందులో ఒకటి కాగా మరో రెండు సినిమాలు అదే బ్యానర్ లో చేస్తాడు. ఐతే అందులో ఒక సినిమా కథ మాత్రం రిషబ్ శెట్టి ఇచ్చే స్టోరీతో వతుందని టాక్.
నటుడిగానే కాదు రిషబ్ శెట్టి (Rishab Shetty) డైరెక్టర్ గా కూడా తన సత్తా చాటుతున్నాడు. రిషబ్ శెట్టి కథతో ప్రభాస్ సినిమా వస్తే మాత్రం బాక్సాఫీస్ బద్ధలు కొట్టే ఛాన్స్ ఉన్నట్టే లెక్క. ఐతే ప్రభాస్ ప్రస్తుతం తాను కమిటైన సినిమాలు పూర్తి చేయాల్సి ఉంది. ఆల్రెడీ సెట్స్ మీద ఉన్న రాజాసాబ్, ఫౌజితో పాటు స్పిరిట్ కూడా పూర్తి చేయాలి. ఆ తర్వాత సలార్ 2, కల్కి 2 ఉన్నాయి.
ఆ నెక్స్ట్ హోంబలె బ్యానర్ లో రిషబ్ శెట్టి కథతో వస్తుంది. ఐతే ఈ సినిమాకు డైరెక్టర్ గా కూడా రిషబ్ పనిచేస్తారా లేదా అన్నది చూడాలి. కాంతారా 2 ని నెక్స్ట్ ఇయర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్న రిషబ్ శెట్టి సినిమాను ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. రిషబ్ శెట్టితో ప్రభాస్ కాంబో కుదురితే మాత్రం ఆ సినిమా రేంజ్ వేరేలా ఉంటుందని చెప్పొచ్చు.
Also Read : Pushpa 2 : ‘పుష్ప-2’పై మాజీ మంత్రి రోజా ప్రశంసలు