RGVకి జైలు శిక్ష విధించిన కోర్ట్
RGV : 2018లో మహేష్ చంద్ర మిశ్రా దాఖలు చేసిన కేసులో కోర్టు వర్మపై తీర్పు నేడు వెలువరించింది. శిక్షతో పాటు 3.72 లక్షల నష్టపరిహారం
- By Sudheer Published Date - 12:24 PM, Thu - 23 January 25

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV)కి అంథేరీ కోర్టు చెక్ బౌన్స్ కేసు(cheque-bouncing case)లో మూడు నెలల జైలు శిక్ష విధించింది. 2018లో మహేష్ చంద్ర మిశ్రా దాఖలు చేసిన కేసులో కోర్టు వర్మపై తీర్పు నేడు వెలువరించింది. శిక్షతో పాటు 3.72 లక్షల నష్టపరిహారం చెల్లించాల్సిన బాధ్యతను కూడా వర్మపై మోపింది. గత ఏడు సంవత్సరాలుగా కోర్టులో ఈ కేసు కొనసాగుతుండగా.. వర్మ కోర్టుకు హాజరుకావడం మానేయడం కోర్టు ఆగ్రహానికి కారణమైంది. కోర్టు తీర్పుకు వర్మ ఎలా స్పందిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. వర్మకు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేయడం, తీర్పును కఠినంగా అమలు చేయడం ఈ కేసుకు మరింత ప్రాచుర్యం దక్కింది. రామ్ గోపాల్ వర్మ కు వివాదాలు , కేసులు, కోర్ట్ లు కొత్తమీ కాదు.కాకపోతే ఈసారి శిక్ష విదించేసరికి వర్మ నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది ఆసక్తిగా మారింది. రీసెంట్ గా వర్మ తన తప్పులు తెలుసుకొని మళ్లీ తన సత్తా ఏంటో చూపిస్తా అని ధీమా వ్యక్తం చేస్తూ కొత్త సినిమాను ప్రకటించాడు.
India vs England: తొలి మ్యాచ్‌లో హైలైట్స్ ఇవే!
సిండికేట్ (Syndicate) పేరుతో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు. ” ఒక్క మనిషి మాత్రమే అత్యంత భయంకరమైన జంతువు కాగలడు. సత్య చిత్రంపై నా కన్ఫెషన్ నోట్‌కు కొనసాగింపుగా, నేను ఎప్పటికైనా అతిపెద్ద చిత్రాన్ని రూపొందించాలని నిర్ణయించుకున్నాను. నా సినిమా పేరు సిండికేట్ అని తెలిపాడు. సిండికేట్ అనేది సుదూర భవిష్యత్తులో సెట్ చేయని భవిష్యత్ కథ. ఉదాహరణకు, సెప్టెంబర్ 11, 2001న ప్రపంచం మొత్తం ఆల్ఖైదాతో నిద్ర లేచింది. కానీ ఈ విషయం సెప్టెంబర్ 10 వరకు కూడా ఎవరికి తెలియదు.సిండికేట్ చిత్రం ఒక ప్రకటనతో ప్రారంభమవుతుంది. ఒక్క మనిషి మాత్రమే అత్యంత భయంకరమైన జంతువు కాగలడు. సిండికేట్ ఎలాంటి సూపర్ పవర్స్ లేని చాలా ప్రమాదకరమైన సినిమా. కానీ, ఒక మనిషి భయంకరంగా ఏమి చేయగలడు అని చూపిస్తుంది. ఈ చిత్రం క్రైమ్ మరియు టెర్రర్ యొక్క స్వభావాన్ని లోతుగా చూపిస్తుంది.
క్రైమ్ మరియు టెర్రర్ ఎప్పటికీ చనిపోవు అనే చీకటి సత్యాన్ని రుజువు చేస్తుంది. వారు మరింత ఘోరమైన ఫార్మ్స్ లో తిరిగి వస్తారు.సిండికేట్ అనే ఈ ఒక్క సినిమాతో గత కొన్ని సంవత్సరాలుగా నేను చేసిన సినిమా పాపాలన్నింటినీ కడిగేసుకుంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను” ప్రెస్ నోట్ రిలీజ్ చేసాడు. కానీ ఇప్పుడు మూడు నెలలు వర్మకు కోర్ట్ జైలు శిక్ష విధించడం తో ఈ సినిమా కు ఆలస్యం తప్పదు అని భావించవచ్చు. ఏది ఏమైనప్పయికి వర్మ కు శిక్ష పడడం మంచిదే అని చాలామంది అభిప్రాయపడుతున్నారు.