HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Review Rishab Shettys Kantara Chapter 1 Captivating Action Drama

Kantara Chapter 1: కాంతార: చాప్టర్‌-1 రివ్యూ.. రిషబ్‌శెట్టి సినిమా ఎలా ఉందంటే?

రిషబ్‌ శెట్టి తర్వాత ఈ సినిమాకి మరో హీరో సంగీత దర్శకుడు అజనీష్‌ లోక్‌నాథ్‌. ఆయన తన నేపథ్య సంగీతంతో కథకు ప్రాణం పోశారు. ముఖ్యంగా ఇంటర్వెల్‌, ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్‌ ఎపిసోడ్స్‌లో ఆయన అందించిన సంగీతం అద్భుతం.

  • By Gopichand Published Date - 01:17 PM, Thu - 2 October 25
  • daily-hunt
Kantara Chapter 1
Kantara Chapter 1

Kantara Chapter 1: ‘కాంతార’ (Kantara Chapter 1) సినిమాతో జాతీయ స్థాయిలో నటుడిగా, దర్శకుడిగా విశేష గుర్తింపు తెచ్చుకున్న రిషబ్‌ శెట్టి (Rishab Shetty), ఇప్పుడు అదే విజయవంతమైన చిత్రానికి ప్రీక్వెల్‌గా ‘కాంతార చాప్టర్‌ 1’ను సిద్ధం చేసి ప్రేక్షకులను మరోసారి దైవిక ప్రపంచంలోకి తీసుకెళ్లాడు. మరి దసరా బరిలో నిలిచిన ఈ ప్రీక్వెల్ ‘కాంతార’ హిట్‌ మ్యాజిక్‌ను పునరావృతం చేసిందా? వెండితెరపై ఎలాంటి అనుభూతిని పంచిందనేది తెలుసుకుందాం.

క‌థ ఇదే

ఇది 8వ శతాబ్దంలో కదంబుల రాజ్యం పాలనలో జరిగే కథ. ఆ రాజ్యంలో ఓ వైపున ఉన్న అటవీ ప్రాంతమే దైవిక భూమి కాంతార. అక్కడి ఈశ్వరుడి పూదోట, మార్మిక బావికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. ఈ మహిమాన్విత ప్రాంతాన్ని దుష్టశక్తుల నుంచి కాపాడుతూ తమ రాజ్యంలోకి బయటివారిని అడుగు పెట్టనివ్వకుండా కాంతార గిరిజన తెగ జాగ్రత్త పడుతుంటుంది. సుగంధ ద్రవ్యాల్ని పండిస్తూ జీవనం సాగించే ఈ తెగకు అక్కడి బావిలో ఓ శిశువు దొరుకుతాడు. అతన్ని దైవ ప్రసాదంగా భావించి బెర్మే (రిషబ్‌ శెట్టి) అనే పేరు పెట్టి పెంచుతారు.

Also Read: ‎Moong Dal: వామ్మో.. ప్రతిరోజు పెసలు తింటే ఏకంగా అన్ని ప్రయోజనాలు కలుగుతాయా?

ఒకసారి తమ రాజ్యంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన భాంగ్రా యువరాజు కులశేఖర (గుల్షన్‌ దేవయ్య), అతని సైనికులకు బెర్మే తగిన బుద్ధి చెబుతాడు. ఆ తర్వాత తమ సుగంధ ద్రవ్యాలతో రాజులు విదేశీ వర్తకం చేస్తున్న తీరును, గిరిజనులను వెట్టి చాకిరితో హింసిస్తున్న వైనాన్ని బెర్మే తెలుసుకుంటాడు. దీంతో తమ తెగను వెట్టి నుంచి విముక్తం చేయడానికి బెర్మే ఒక నిర్ణయం తీసుకుంటాడు. భాంగ్రా రాజును ఎదిరించి సొంతంగా వ్యాపారం చేసేందుకు సిద్ధమవుతాడు. ఈ నిర్ణయం కాంతార గిరిజన తెగకు ముప్పుగా ఎందుకు మారింది? ఈ కథలో భాంగ్రా రాజు రాజశేఖర్‌ (జయరామ్‌), ఆయన కుమార్తె కనకావతికి (రుక్మిణి వసంత్‌) ఉన్న ప్రాధాన్యత ఏంటి? ఈశ్వరుడి పూదోటలో ఉన్న దైవ రహస్యం ఏంటి? అన్నదే ఈ చిత్ర కథాంశం.

ఎలా ఉందంటే?

‘కాంతార: చాప్టర్‌ 1’ కథ ‘కాంతార’ చిత్రంలో హీరో, అతని తండ్రి మాయమయ్యే చోటు నుంచే ప్రారంభమవుతుంది. అసలు ఆ కాంతార ప్రాంతం ఏంటి? పంజుర్లి, గులిగ వంటి దైవిక గణాల మూల కథ ఏంటి? అనే అంశాలను అన్వేషిస్తూ ఈ ప్రీక్వెల్‌ సాగుతుంది. రిషబ్‌ శెట్టి సృష్టించిన ఈ కొత్త ప్రపంచం ప్రేక్షకులను మరో లోకంలోకి తీసుకెళ్తుంది.

సినిమా తొలి 20 నిమిషాల్లో కాంతార గిరిజన తెగల జీవితాలు, రాజుల అణచివేతలను ఆసక్తికరంగా పరిచయం చేశారు. ఈశ్వరుడి పూదోటలోని బావి నేపథ్యంగా వచ్చే సీక్వెన్స్‌లు, అక్కడ పరిచయమయ్యే ఈశ్వర గణాల కథ థ్రిల్‌ పంచుతుంది. ప్రథమార్థం అక్కడక్కడా నెమ్మదిగా అనిపించినా.. ఇంటర్వెల్‌కు ముందు వచ్చే టైగర్‌ సీక్వెన్స్‌, అసురజాతితో హీరో చేసే యాక్షన్‌ సీక్వెన్స్‌లు ప్రేక్షకులను రొమాంచితంగా కట్టిపడేస్తాయి.

ద్వితీయార్ధం కథ చకచకా పరుగులు పెడుతుంది. కాంతార తెగను అంతమొందించేందుకు యువరాజు కులశేఖర చేసే ప్రయత్నాలు, పూదోటలో విధ్వంసం, తన జాతిని కాపాడుకోవడానికి రిషబ్‌ చేసే యుద్ధం, గులిగలా మారి చేసే రుద్ర తాండవం ప్రేక్షకుల్ని ఒక ట్రాన్స్‌లోకి తీసుకెళ్తుంది. ప్రీ-క్లైమాక్స్‌ నుంచి శుభం కార్డు వరకు సాగే కథ మరో స్థాయిలో ఉంటుంది. ముఖ్యంగా కనకావతి పాత్రలోని మరో కోణం బయటపడ్డాక కథనంలో సంఘర్షణ రెట్టింపవుతుంది. ప్రీ-క్లైమాక్స్‌లో హీరో గతాన్ని, దైవిక బావితో అతడి సంబంధాన్ని థ్రిల్లింగ్‌గా చూపించడం, ఆ తర్వాత ఈశ్వర సాక్షాత్కారంతో కూడిన క్లైమాక్స్‌ ప్రేక్షకులకు ఒక అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది. ‘కాంతార: చాప్టర్‌ 2’కి లీడ్‌ ఇస్తూ సినిమాని ముగించిన తీరు సంతృప్తికరంగా ఉంది.

నటీనటుల ప్రదర్శన

‘కాంతార చాప్టర్‌ 1’ పూర్తిగా రిషబ్‌ శెట్టి (Rishab Shetty) వన్‌ మ్యాన్‌ షో. దర్శకుడిగా కథను అల్లిన తీరు, దాన్ని తెరపై ఆవిష్కరించిన విధానం, నటుడిగా ఆ కథకు ప్రాణం పోసిన విధానం.. అన్నీ అద్భుతం. ముఖ్యంగా రుద్ర గులిగలా, ఈశ్వర గణంలా, చండికలా తెరపై రిషబ్‌ చేసిన విన్యాసాలు ప్రేక్షకులకు పూనకాలు తెప్పించేలా ఉంటాయి. కనకావతి పాత్రలో రుక్మిణి వసంత్‌ స్క్రీన్‌ ప్రెజెన్స్‌, భిన్న కోణాల్లో ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచిన తీరు బాగుంది. జయరామ్‌ పాత్ర పతాక ఘట్టాలు వచ్చేసరికి విశ్వరూపం చూపించింది.

రిషబ్‌ శెట్టి తర్వాత ఈ సినిమాకి మరో హీరో సంగీత దర్శకుడు అజనీష్‌ లోక్‌నాథ్‌. ఆయన తన నేపథ్య సంగీతంతో కథకు ప్రాణం పోశారు. ముఖ్యంగా ఇంటర్వెల్‌, ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్‌ ఎపిసోడ్స్‌లో ఆయన అందించిన సంగీతం అద్భుతం. పాటలు కథలో భాగంగానే సాగుతాయి. విజువల్‌ ఎఫెక్ట్స్‌ అద్భుతంగా కుదిరాయి. టైగర్‌ సీక్వెన్స్, దైవిక ఎఫెక్ట్స్‌ కనులవిందుగా ఉన్నాయి. అడవి అందాల్ని కెమెరాతో బంధించిన తీరు అద్భుతం. ఆర్ట్‌ వర్క్‌ ఈ చిత్రానికి మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. నిర్మాణం చాలా ఉన్నతంగా ఉంది.

బలాలు

  • రిషబ్‌ శెట్టి నటన, దర్శకత్వం
  • అజనీష్ లోక్‌నాథ్ నేపథ్య సంగీతం
  • ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్
  • అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్, ఆర్ట్ వర్క్

బలహీనతలు

  • ప్రథమార్థం కొన్ని చోట్ల నెమ్మదిగా సాగడం.

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Cinema Review
  • Kantara Chapter 1
  • Kantara Chapter 1 Review
  • Movie Reviews
  • Rishab Shetty

Related News

Kantara Chapter 1

Kantara Chapter 1: కాంతారా చాప్ట‌ర్ 1కు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్ర‌భుత్వం!

అయితే ఈ ధరల పెంపు సామాన్య ప్రేక్షకులపై కొంత భారం మోపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. సాధారణంగా సినిమా టికెట్ ధరలు ఎక్కువగా ఉంటే కుటుంబ సమేతంగా సినిమా చూసే ప్రేక్షకులకు ఇది కొంత ఇబ్బందిగా మారవచ్చు.

  • Kantara Chapter 1

    Rishab Shetty: పారితోషికం వద్దని లాభాల్లో వాటా తీసుకుంటున్న రిషబ్ శెట్టి!

  • Ntr Kanthara

    Jr NTR : కనీసం నిల్చులేకపోతున్న ఎన్టీఆర్..గాయం పెద్దదే !!

Latest News

  • Indian Cricket: 15 ఏళ్ల‌లో ఇదే తొలిసారి.. దిగ్గజాలు లేకుండా గ్రౌండ్‌లోకి దిగిన టీమిండియా!

  • Donald Trump: మందుల‌పై 100 శాతం టారిఫ్‌.. ఇంకా ఎందుకు అమ‌లు కాలేదు?!

  • Kantara Chapter 1: కాంతార: చాప్టర్‌-1 రివ్యూ.. రిషబ్‌శెట్టి సినిమా ఎలా ఉందంటే?

  • Ramreddy Damodar Reddy: మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి కన్నుమూత.. ఆయ‌న రాజ‌కీయ జీవిత‌మిదే!

  • ‎Curd with Chia Seeds: పెరుగులో చియా సీడ్స్ కలిపి తీసుకుంటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

Trending News

    • DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం!

    • Vijayadashami: రేపే దసరా.. విజయదశమి నాడు ఏం చేయాలి? ఏం చేయకూడదు?

    • Economic Changes: నేటి నుండి అమలులోకి వచ్చిన 6 ప్రధాన ఆర్థిక మార్పులీవే!

    • Arattai App: ట్రెండింగ్‌లో అరట్టై.. ఈ యాప్ సీఈవో సంపాద‌న ఎంతో తెలుసా?

    • Suryakumar Yadav: చ‌ర్చ‌నీయాంశంగా సూర్య‌కుమార్ యాద‌వ్ వాచ్‌.. ధ‌ర ఎంతంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd