Moong Dal: వామ్మో.. ప్రతిరోజు పెసలు తింటే ఏకంగా అన్ని ప్రయోజనాలు కలుగుతాయా?
Moog Dal: పెసల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయని వీటిని రోజు తీసుకోవడం వల్ల అనేక లాభాలు కలగడంతో పాటు సమస్యలు దూరమవుతాయని చెబుతున్నారు.
- By Anshu Published Date - 07:30 AM, Thu - 2 October 25

Moog Dal: మన వంటింట్లో దొరికే తృణధాన్యాలలో పెసలు కూడా ఒకటి. పెసలతో కొన్ని రకాల వంటలు కూడా తయారు చేస్తూ ఉంటారు. కాగా వీటిని తరచుగా తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి అని చెబుతున్నారు. ఇవి రుచిగా ఉండడంతో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ప్రోటీన్, ఫైబర్, మినరల్స్ తో నిండి ఉంటుంది. దీనిలో విటమిన్ బి12 కూడా పుష్కలంగా ఉంటుంది.
అందుకే దీనిని శాకాహారులకు పవర్ ఫుడ్ అని కూడా పిలుస్తారు. కాగా ప్రతిరోజూ సరైన పద్ధతిలో పెసరపప్పు తీసుకుంటే విటమిన్ బి12 లోపం తగ్గుతుందట. అంతేకాకుండా శరీరంలో రక్తహీనత తగ్గి, రోగనిరోధక శక్తి పెరిగి బలహీనత కూడా దూరమవుతుందని చెబుతున్నారు. అదేవిధంగా రాత్రి పడుకునే ముందు ఒక కప్పు పెసర పప్పును బాగా కడిగి నీటిలో నాన బెట్టి ఉదయం ఆ నీరు తాగాలి. నానబెట్టిన పప్పులో ఉల్లిపాయ, నిమ్మకాయ, టమోటా వేసి సలాడ్ లాగా తీసుకోవచ్చట.
ఈ పద్ధతి మీ శరీరాన్ని డీటాక్స్ చేయడంలో హెల్ప్ చేస్తుందట. విటమిన్లు, ఖనిజాలను శరీరానికి అందిస్తుందట. అంతేకాకుండా పెసర పప్పును కిచిడి, సూప్ లేదా స్ప్రౌట్స్ రూపంలో కూడా తీసుకోవచ్చని, ఇది తేలికగా జీర్ణం కావడానికి హెల్ప్ చేస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే ఎలాంటి సప్లిమెంట్స్ లేకుండా కేవలం సహజ పద్ధతిలో విటమిన్ B12 లోపాన్ని భర్తీ చేయాలి అనుకుంటే పెసర పప్పును రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలని, కొన్ని వారాల్లోనే తేడాను గమనించవచ్చు అని చెబుతున్నారు. కాబట్టి రోజు పెసలు తీసుకోవడం వల్ల అనేక లాభాలు కలగడంతో పాటుగా కొన్ని రకాల సమస్యలను కూడా అధిగమించవచ్చును చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.