Renu Desai : పవన్ కళ్యాణ్ విషయంలో నన్ను లాగొద్దు – రేణుదేశాయ్ హెచ్చరిక
పవన్ కల్యాణ్ పై రాజకీయ విమర్శలు చేసినా, ఆయన మేనిఫెస్టోను విమర్శించినా తనకు ఇబ్బందిలేదని... కానీ ప్రతిసారీ తనను, తన పిల్లలను లాగడం ఏమిటని మండిపడ్డారు
- Author : Sudheer
Date : 28-10-2023 - 12:04 IST
Published By : Hashtagu Telugu Desk
పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ (Renu Desai)..మళ్లీ సినిమాల ఫై ఫోకస్ పెట్టింది. బద్రి (Badri) సినిమాతో చిత్రసీమలోకి అడుగుపెట్టిన ఈమె..ఆ తర్వాత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తో సహజీవనం చేసి ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. ఆ తర్వాత పవన్ ను పెళ్లి (Marraige) చేసుకుంది. కొంతకాలం తర్వాత ఇద్దరు విడాకులు తీసుకొని విడిపోయారు. ప్రస్తుతం రేణు తన పిల్లలతో ఒంటరిగా ఉండగా..పవన్ మరో పెళ్లి చేసుకొని సినిమాలు , రాజకీయలతో బిజీ అయ్యారు.
We’re now on WhatsApp. Click to Join.
రీసెంట్ గా రేణు దేశాయ్..టైగర్ నాగేశ్వర్ రావు (Tiger Nageswara Rao) సినిమాతో తెలుగు లో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొని సినిమా విశేషాలతో పాటు తన పర్సనల్ విషయాలను సైతం షేర్ చేసింది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ లో హీరోయిన్ల ఫై కొంతమంది చేస్తున్న కామెంట్స్ ఫై ఫైర్ అయ్యారు. హీరోయిన్ లుక్ పై కామెంట్ చేయొచ్చని, యాక్టింగ్ పై కామెంట్లు చేయొచ్చని… కానీ ఆమె క్యారెక్టర్ ను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. ఎంత మందితో పడుకుంది అని మాట్లాడుతూ ఆడవాళ్ల వ్యక్తిత్వాన్ని చంపేస్తున్నారని రేణు చెప్పుకొచ్చింది.
ఇలాంటివి మానుకోవాలని సూచించింది. అలాగే పవన్ కల్యాణ్ పై రాజకీయ విమర్శలు చేసినా, ఆయన మేనిఫెస్టోను విమర్శించినా తనకు ఇబ్బందిలేదని… కానీ ప్రతిసారీ తనను, తన పిల్లలను లాగడం ఏమిటని మండిపడ్డారు. తమను టార్గెట్ చేయడం మరీ ఎక్కువవుతోందని… వీటికి ముగింపు పలకాలని అన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చిన తనను , తన పిల్లలను లాగుతున్నారని ఇది మంచి పద్ధతి కాదని , పవన్ – నేను విడిపోయి చాల కాలం అవుతుంది. ఎవరికీ వాళ్లం బ్రతుకుతున్నాం..అయినప్పటికీ ప్రతిసారి నన్ను లాగడం ఏంటి..? వారి రాజకీయ లబ్ది కోసం నన్ను టార్గెట్ చేయడం మంచిది కాదని అన్నారు.
Read Also : Benefits of Cloves : లవంగం తింటే ఎన్ని లాభాలో తెలిస్తే..అస్సలు వదిలిపెట్టారు.ముఖ్యంగా మగవారు