Renu Desai 2nd Marriage : రెండో పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదే – రేణు దేశాయ్
Renu Desai 2nd Marriage : ‘‘నేను రెండో పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించాను. ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్నా. కానీ ఆ రిలేషన్‌షిప్‌కీ, పిల్లలకీ సమంగా న్యాయం చేయలేనని నాకు అర్థమయ్యింది’’
- By Sudheer Published Date - 09:09 PM, Wed - 9 April 25

సినీ నటి, పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ (Renu Desai ) ఆమె వ్యక్తిగత జీవితం గురించి ఓ పాడ్‌కాస్ట్‌లో మనసులోని మాటలను వెలిబుచ్చారు. పవన్ కళ్యాణ్‌తో విడాకుల (Divorce) తర్వాత మళ్లీ పెళ్లి (Renu Desai 2nd Marriage) చేసుకోవాలన్న ఆలోచన వచ్చినప్పటికీ, పిల్లల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ఆ నిర్ణయాన్ని తీసుకోలేదని తెలిపారు. ‘‘నేను రెండో పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించాను. ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్నా. కానీ ఆ రిలేషన్‌షిప్‌కీ, పిల్లలకీ సమంగా న్యాయం చేయలేనని నాకు అర్థమయ్యింది’’ అంటూ ఆమె చెప్పిన మాటలు ఆకట్టుకున్నాయి.
రేణు దేశాయ్ తన పిల్లల పట్ల ఉన్న ప్రేమను, బాధ్యతను ఈ మాటలతో స్పష్టంగా తెలిపారు. ప్రత్యేకంగా తన కూతురు ఆద్య గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆమె వయసు 15 ఏళ్లు అని, ఆమెకు 18 ఏళ్లు వచ్చే వరకూ నేను ఏ నిర్ణయాన్నీ తీసుకోను. ఆ తర్వాతే మళ్లీ పెళ్లి గురించి ఆలోచిస్తానని తెలిపింది. పిల్లల ఎదుగుదలలో తల్లి పాత్ర ఎంతో కీలకం కాబట్టి, వారి భవిష్యత్తు కోసం తాను త్యాగం చేయడం వెనకాడలేదని ఆమె స్పష్టం చేశారు.
Jogi Ramesh : జోగి రమేష్ కు మరోసారి సీఐడీ నోటీసులు
ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ప్రాచుర్యం పొందుతున్నాయి. పలువురు నెటిజన్లు, అభిమానులు రేణు దేశాయ్ నిర్ణయాన్ని మెచ్చుకుంటూ, ఆమె తల్లిగా తీసుకున్న బాధ్యతాయుతమైన వైఖరిని ప్రశంసిస్తున్నారు. తల్లిగా మాత్రమే కాదు, మహిళగా తన భావోద్వేగాలను నిస్సందేహంగా చెప్పిన రేణు దేశాయ్ మాటలు, తల్లితనాన్ని గౌరవించే ప్రతి ఒక్కరినీ మెచ్చేలా చేశాయి.