Akira Nandan Cine Entry : అకీరా ఇంట్రీపై రేణు క్లారిటీ
ఒక నటుడికి కావాల్సిన అన్ని క్వాలిటీ లు తనలో వున్నాయి. నేను ఒక నటిని. వాళ్ళ నాన్న, పెదనాన్న యాక్టర్స్. తను తెరపై ఎలా కనిపిస్తాడో చూడాలని తల్లిగా నాకూ వుంటుంది
- Author : Sudheer
Date : 15-10-2023 - 10:48 IST
Published By : Hashtagu Telugu Desk
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కుమారుడు అకీరా (Akira) సినీ ఇంట్రీపై మెగా అభిమానులు ఎప్పటి నుండో ఎదురుచూస్తున్నారు. కానీ అకీరా ఇంట్రీపై మాత్రం పవన్ కళ్యాణ్ కానీ రేణు కానీ పెద్దగా స్పందించింది లేదు. తాజాగా రేణు దేశాయ్..టైగర్ నాగేశ్వర్ రావు మూవీ ప్రమోషన్ కార్యక్రమాల్లో అకిరా ఎంట్రీ ఫై క్లారిటీ ఇచ్చింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైనా రేణుదేశాయ్ మళ్ళీ 20 ఏళ్ళ తర్వాత టైగర్ నాగేశ్వర్ రావు (Tiger Nageswara Rao) సినిమాతో మళ్ళీ చిత్రసీమలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతుంది. దసరా కానుకగా ఈ నెల 20 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రవితేజ హీరోగా నటిస్తున్న ఈ మూవీ ఫై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ సినిమా ప్రమోషన్ లో పాల్గొన్న రేణు..సినిమా విశేషాలతో పాటు తన పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసింది.
We’re now on WhatsApp. Click to Join.
ముఖ్యంగా అకీరా ఇంట్రీ (Akira Nandan Cine Entry)పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘హీరోగా చేయాలనే ఆసక్తి అకీరాకి ఈ క్షణం వరకూ లేదు. అకీరాది చాలా భిన్నమైన వ్యక్తిత్వం. పియానో నేర్చుకున్నాడు. అలాగే ఫిల్మ్ ప్రొడక్షన్ గురించి కూడా నేర్చుకున్నాడు. యోగా, మార్సల్ ఆర్ట్స్, కిక్ బాక్సింగ్ ఇవన్నీ నేర్చుకున్నాడు. తనకి రైటింగ్ ఇష్టం. ఒక స్క్రిప్ట్ కూడా రాశాడు. అయితే ఇప్పటి వరకు నటుడిని అవుతానని మాత్రం చెప్పలేదు. తను హీరో అవ్వాలని డిసైడ్ అయితే అందరికంటే ముందు నేనే ప్రకటిస్తా. తన కొడుకుని బిగ్ స్క్రీన్ పై చూడాలని ప్రతి తల్లికి వుంటుంది. నాకు కూడా వుంది. అయితే హీరో కావాలని ముందు తనకి అనిపించాలి. తను చూడటానికి అందంగా ఉంటాడు. ఒక నటుడికి కావాల్సిన అన్ని క్వాలిటీ లు తనలో వున్నాయి. నేను ఒక నటిని. వాళ్ళ నాన్న, పెదనాన్న యాక్టర్స్. తను తెరపై ఎలా కనిపిస్తాడో చూడాలని తల్లిగా నాకూ వుంటుంది.’ అని రేణు తెలిపింది.
Read Also : CM KCR Public Meeting in Husnabad : రాయి ఏంటో రత్నమేదో గుర్తించి ఓటు వేయమని కోరిన కేసీఆర్..