HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Renowned Director And Actor K Bhagyaraj Passes Away

K Bhagyaraj: ప్రముఖ దర్శకుడు, నటుడు కె. భాగ్యరాజ్ కన్నుమూత

  • Author : Vamsi Chowdary Korata Date : 27-06-2026 - 10:39 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Renowned director and actor K. Bhagyaraj passes away.
Renowned director and actor K. Bhagyaraj passes away.

దక్షిణాది చిత్ర పరిశ్రమలో మరో తీవ్ర విషాదం నెలకొంది. దిగ్గజ దర్శకుడు భారతీ రాజా కన్నుమూసి 20 రోజులు కూడా ముగియక ముందే మరో సినీ దిగ్గజం దివికేగింది. తమిళ సినీ రంగంలో తనదైన స్క్రీన్ ప్లే మాయాజాలంతో దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించిన లెజెండరీ నటుడు, దర్శకుడు, రచయిత కె. భాగ్యరాజ్ (73) కన్నుమూశారు. చెన్నైలోని ఆయన నివాసంలో గుండెపోటు రావడంతో శనివారం ఉదయం ఆయన ఆకస్మికంగా తుదిశ్వాస విడిచారు. భాగ్యరాజ్ మరణవార్త విన్న సినీ లోకం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైంది. ఆయన భౌతికకాయాన్ని చూసేందుకు సినీ ప్రముఖులు, అభిమానులు భారీగా తరలివస్తున్నారు.

కె. భాగ్యరాజ్ కేవలం ఒక నటుడిగానే కాకుండా దర్శకుడిగా, అద్భుతమైన స్క్రీన్ ప్లే రచయితగా, సంగీత దర్శకుడిగా భారతీయ చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేశారు. ఆయన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో దాదాపు 75 చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలు పోషించి మెప్పించారు. నటుడిగా పీక్‌లో ఉన్న సమయంలోనే మెగాఫోన్ పట్టి 25 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ముఖ్యంగా ఆయన రాసే కథలు, స్క్రీన్ ప్లేలు ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్‌లుగా నిలిచాయి.

ఆయన కెరీర్‌లో ‘అంద 7 నాట్కల్’ (1981), ‘ముంధనై ముడిచ్చు’ (1983), ‘చిన్న వీడు’ (1985), ‘అవసర పోలీస్ 100’ (1990) వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్ లుగా నిలవడమే కాకుండా, క్లాసిక్స్‌గా నిలిచిపోయాయి. ‘ముంధనై ముడిచ్చు’ (తెలుగులో ‘భాగ్యలక్ష్మి కథ’) చిత్రంలో ఆయన కనబరిచిన నటనకు గాను తమిళనాడు ప్రభుత్వం ఉత్తమ నటుడి అవార్డును అందించింది. ఆయన సినిమాల్లోని సెంటిమెంట్, హ్యూమర్ ఎప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతాయి. ఆయన తీసిన చాలా సినిమాలు తెలుగులోకి రీమేక్ కావడమే కాకుండా, నటుడిగానూ ఆయన పలు తెలుగు చిత్రాల్లో నటించి మెప్పించారు.

భాగ్యరాజ్ మృతితో ఆయన భార్య (ప్రముఖ నటి పూర్ణిమ భాగ్యరాజ్), కుమార్తె శరణ్య, కుమారుడు (నటుడు శాంతను భాగ్యరాజ్) కన్నీరుమున్నీరవుతున్నారు. ఒక గొప్ప మార్గదర్శకుడిని, సినీ గురువును కోల్పోయామంటూ కోలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు సామాజిక మాధ్యమాల ద్వారా ఎమోషనల్ పోస్టులు పెడుతూ నివాళులర్పిస్తున్నారు. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని, వారి కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నారు. ఆయన భౌతికకాయానికి ఆదివారం ఉదయం చెన్నైలో అంత్యక్రియలు జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ప్రముఖ తమిళ దిగ్గజ దర్శకుడు, నటుడు భారతీరాజా (84) ఈ నెల 10న చెన్నైలోని తన నివాసంలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా వయస్సు సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. భారతీరాజా మృతి నుంచి ఇంకా కోలుకోని దక్షిణాది ఇండస్ట్రీని కె. భాగ్యరాజ్ మరణం మరోసారి కుంగదీసింది.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Actor Passes Away
  • director
  • heart attack
  • k Bhagyaraja
  • Kollywood
  • tamil actor

Related News

    Latest News

    • Rains: తెలంగాణకు భారీ వర్షసూచన

    • Amaravati Farmers: వైకాపా నేతల పర్యటనను అడ్డుకున్న రాజధాని రైతులు

    • Uppal Balu: ఉప్పల్ బాలుకు ఊహించని షాక్ ఇచ్చిన పోలీసులు

    • Paederus Beetles: అమ్మో ఏపీని వణికిస్తున్న యాసిడ్‌ పురుగులు..

    • Alcohol: మాయమ్మే… ఆ విషయంలో మగజాతిని మించిపోయారు కదా…!!

    Trending News

      • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd