RC16 టీజర్‌కు ముహూర్తం ఫిక్స్..!
RC16 : ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జెట్ స్పీడ్ గా నడుస్తుంది. ఇటీవల హైదరాబాద్‌లో మొదటి షెడ్యూల్ జరుగగా.. ఈ షెడ్యూల్ లో క్రికెట్‌కు సంబంధించిన అనేక కీలక సన్నివేశాలు చిత్రీకరించారని తెలుస్తోంది
- By Sudheer Published Date - 02:44 PM, Mon - 24 February 25

రామ్ చరణ్, బుచ్చిబాబు (Ram Charan – Buchhibabu) సన కాంబినేషన్‌లో రూపొందనున్న RC16 సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. బుచ్చిబాబు సన తన మొదటి చిత్రం ఉప్పెనతోనే ప్రేక్షకులను మెప్పించి, ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అతని దర్శకత్వ శైలి, భావోద్వేగాల ప్రదర్శన ఈ సినిమాపై మరింత ఆసక్తి పెంచుతోంది. ఇప్పటికే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జెట్ స్పీడ్ గా నడుస్తుంది. ఇటీవల హైదరాబాద్‌లో మొదటి షెడ్యూల్ జరుగగా.. ఈ షెడ్యూల్ లో క్రికెట్‌కు సంబంధించిన అనేక కీలక సన్నివేశాలు చిత్రీకరించారని తెలుస్తోంది. తదుపరి షెడ్యూల్ మార్చి మొదటి వారంలో దిల్లీలో జరగనున్నట్లు సమాచారం. ఆ షెడ్యూల్లో రెజ్లింగ్‌కు సంబంధించిన సీన్స్ తెరకెక్కిస్తున్నారు. ఆలాగే ఈ సినిమా టైటిల్, టీజర్‌ను రామ్‌చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే సినిమా షూటింగ్ ను కూడా త్వరగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు.
India vs Pak Match : కేసీఆర్ ను కోహ్లీ రికార్డు తో పోల్చిన మంత్రి కొండా సురేఖ
ఇక బుచ్చిబాబు ఈ సినిమా కోసం దాదాపు రెండేళ్ల నుంచి వర్క్ చేయడం జరిగింది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా రానున్నట్లు సమాచారం. ఇందులో రామ్‌చరణ్ పాత్ర పవర్ ఫుల్‌గా ఉండనుంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఆమెకు ఇది తెలుగులో రెండో సినిమా కావడం విశేషం. దేవర తో ఈమె టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అలాగే RC16 లో కన్నడ స్టార్ నటుడు శివ రాజ్‌కుమార్, జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నాయి.