India vs Pak Match : కేసీఆర్ ను కోహ్లీ రికార్డు తో పోల్చిన మంత్రి కొండా సురేఖ
India vs Pak Match : కేసీఆర్ ప్రజలకు అందుబాటులో లేకపోవడం పెద్ద రికార్డే కదా అంటూ సెటైర్ వేశారు
- By Sudheer Published Date - 02:23 PM, Mon - 24 February 25

బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (Former CM KCR) తెలంగాణ అసెంబ్లీకి (Telangana Assembly) రాకపోవడంపై మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) సెటైరికల్ ట్వీట్ చేసి వైరల్ గా మారింది. నిన్న జరిగిన భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్‌లో కోహ్లీ బద్దలు కొట్టిన రికార్డును ప్రస్తావిస్తూ కేసీఆర్ పై సురేఖ కీలక వ్యాఖ్యలు చేసింది. కేసీఆర్ ప్రజలకు అందుబాటులో లేకపోవడం పెద్ద రికార్డే కదా అంటూ సెటైర్ వేశారు. ఎక్స్ వేదికగా కేసీఆర్‌పై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
Delhi Assembly : ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు.. ప్రొటెం స్పీకర్‌గా అరవిందర్ ఎన్నిక
దుబాయ్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీం ఇండియా ఘన విజయం సాధించడం హర్షణీయమని, 6 వికెట్ల తేడాతో భారత్ బంపర్ విక్టరీ కొట్టిన విషయం అందరం టీవీలో చూసి సంబురపడ్డామన్నారు. 14 వేల రన్నులు కొట్టి విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు కొట్టగా… మన రాష్ట్ర ప్రతిపక్ష నేత కేసీఆర్ కూడా దాదాపు ఈ 14 నెలల కాలంలో 14 రోజులు కూడా అసెంబ్లీకి రాలేదన్నారు. ప్రజా సమస్యలపై ప్రజలకి అందుబాటులో ఉండకపోవడం దేశ రాజకీయ చరిత్రలో పెద్ద రికార్డే కదా అంటూ ఎద్దేవా చేశారు. 14 వేల రన్నులు చేసిన విరాట్ కోహ్లీ ఒకవైపు వార్తల్లో పతాక శీర్షికలలో నిలిస్తే… 14 నెలలుగా ఇంకా విరాట పర్వం వీడని ప్రతిపక్ష నేత కేసీఆర్ కూడా వార్తల్లోకి ఎక్కడం ఆలోచించాల్సిన విషయం కాదా? అంటూ మంత్రి సురేఖ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ ను కాంగ్రెస్ శ్రేణులు వైరల్ చేస్తున్నారు.
దుబాయ్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో #teamindia ఘన విజయం సాధించడం హర్షణీయం.
6 వికెట్ల తేడాతో భారత్ బంపర్ విక్టరీ కొట్టిన విషయం మన అందరం టీవీలో చూసి సంబురపడినం.
14 వేల రన్నులు కొట్టి @imVkohli రికార్డు బద్దలు కొట్టగా… మన రాష్ట్ర ప్రతిపక్ష నేత #kcr గారు కూడా దాదాపు ఈ… pic.twitter.com/OoOZpn2RRm
— Konda Surekha (@iamkondasurekha) February 24, 2025