RC16 ఆమె ఫిక్స్.. రెమ్యునరేషన్ కూడా లీక్..!
RC16 RRR తర్వాత రాం చరణ్ గ్లోబల్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. ట్రిపుల్ ఆర్ తర్వాత ఆచార్య సినిమా చేసిన చరణ్ ఆ సినిమా తో డిజాస్టర్ ఫేస్ చేశాడు. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో గేం చేంజర్ సినిమా
- By Ramesh Published Date - 05:10 PM, Mon - 19 February 24
RC16 RRR తర్వాత రాం చరణ్ గ్లోబల్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. ట్రిపుల్ ఆర్ తర్వాత ఆచార్య సినిమా చేసిన చరణ్ ఆ సినిమా తో డిజాస్టర్ ఫేస్ చేశాడు. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో గేం చేంజర్ సినిమా చేస్తున్నాడు రాం చరణ్. ఆ సినిమా పూర్తి కాగానే బుచ్చి బాబు డైరెక్షన్ లో సినిమా చేయాల్సి ఉంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్లో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.
ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వి కపూర్ ని ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. ఆల్రెడీ దేవర తో జాన్వి కపూర్ టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తుండగా చరణ్ సినిమాను కూడా అమ్మడు ఓకే చేసిందట. ఈ విషయాన్ని బోనీ కపూర్ లేటెస్ట్ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ మూవీని భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
చరణ్ బుచ్చి బాబు ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ తో చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో జాన్వి కపూర్ తో పాటుగా అలియా భట్ కూడా మరో హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. జాన్వి కపూర్, అలియా భట్ ఇద్దరు హీరోయిన్స్ ఈ సినిమాలో ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. మొత్తానికి బాలీవుడ్ అందాల భామలు ఇద్దరు చరణ్ సినిమాలో భాగం అవుతున్నారు. ఆర్సీ 16లో నటించేందుకు గాను జాన్వి కపూర్ 3 కోట్ల దాకా తీసుకుంటున్నారని తెలుస్తుంది.
Related News
Ram Charan : రామ్ చరణ్ వేసిన షర్టు ధర తెలిస్తే షాక్ అవుతారు..
గేమ్ ఛేంజర్ చెన్నై షెడ్యూల్ కోసం నిన్న హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి రామ్ చరణ్ బయలుదేరారు. ఆ సమయంలో చరణ్ వేసిన షర్టు ధర తెలిస్తే షాక్ అవుతారు.