Eagle OTT: రెండు ఓటీటీల్లో సందడి చేస్తున్న రవితేజ ఈగల్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచో తెలుసా?
- Author : Sailaja Reddy
Date : 27-02-2024 - 9:33 IST
Published By : Hashtagu Telugu Desk
టాలీవుడ్ హీరో మాస్ మహారాజా రవితేజ తాజాగా నటించిన చిత్రం ఈగల్. టైగర్ నాగేశ్వర రావు మూవీతో పాన్ ఇండియా హీరోగా మారిపోయిన రవితేజ ఇటీవల ఈగల్ సినిమాతో థియేటర్లలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించారు. అలాగే నవదీప్, అవసరాల శ్రీనివాస్, మధుబాల తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇటీవల ఫిబ్రవరి 9న థియేటర్లలో రిలీజైన ఈగల్ డీసెంట్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది.
రవితేజ నటన, యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్ ఈగల్ సినిమాలో హైలెట్ గా నిలిచాయి. థియేటర్లలో ఆడియెన్స్ ను మెప్పించిన ఈగల్ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ రవితేజ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. మార్చి 1 నుంచి ఓటీటీలో ఈగల్ ను ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు. మరోవైపు రవితేజ ఈగల్ డిజిటల్ స్ట్రీమింగ్ పార్టనర్ గా మరో ఓటీటీ ప్లాట్ ఫామ్ వచ్చి చేరింది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో సైతం ఈగల్ సినిమాని స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించినట్లు తెలుస్తోంది. మార్చి 1 న లేదా మార్చి 8న రవితేజ సినిమాను ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకురానున్నట్లు అమెజాన్ ప్రైమ్ వెల్లడించినట్లు సమాచారం. అంటే ఈగల్ సినిమా రెండు ఓటీటీ లలో ప్రదర్శితం కానుంది. కాగా రవితేజ ఇందులో మరో డిఫరెంట్ రోల్ లో కనిపించి ఫ్యాన్స్ ను మెప్పించారు. అలాగే అనుపమ పరమేశ్వరన్, నవదీప్, అవసరాల శ్రీనివాస్ ముఖ్యమైన పాత్రలలో కనిపించి కథను ముందుకు నడిపిన విధానం ప్రేక్షకులకు నచ్చేసింది.