Raviteja – Balakrishna : సంక్రాంతికి రవితేజ ప్లేస్ లో బాలయ్య..!
Raviteja - Balakrishna సితార బ్యానర్ లో భాను భోగవరపు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ షూటింగ్ లో రవితేజ భుజానికి గాయం
- By Ramesh Published Date - 10:40 AM, Sat - 14 September 24

Raviteja – Balakrishna 2025 సంక్రాంతికి రిలీజ్ అవబోతున్న సినిమాల రిలీజ్ షెడ్యూల్ రెడీ అవుతుంది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సంక్రాంతి కానుకగా రాబోతుంది. ఈ సినిమా తర్వాత వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ తోనే సినిమా చేస్తున్నారు. అది పొంగల్ కి రిలీజ్ ఫిక్స్ చేశారు. అసలైతే ఈసారి సంక్రాంతికి మాస్ మహరాజ్ రవితేజ సినిమా కూడా రిలీజ్ చేయాలని అనుకున్నారు.
సితార బ్యానర్ లో భాను భోగవరపు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ షూటింగ్ లో రవితేజ భుజానికి గాయం అవ్వడం వల్ల ఆయన 6 వారాలు రెస్ట్ తీసుకోనున్నారు. అందుకే రవితేజ సినిమా సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్నట్టే అని తెలుస్తుంది. ఐతే రవితేజ ప్లేస్ లో బాలయ్య సినిమా వచ్చే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది.
బాలకృష్ణ కె.ఎస్.బాబీ కాంబో..
బాలకృష్ణ కె ఎస్ బాబీ కాంబో సినిమా సెట్స్ మీద ఉంది. NBK 109వ సినిమాగా రాబోతున్న ఈ సినిమా అసలైతే డిసెంబర్ రిలీజ్ అనుకున్నా కూడా అది ఇప్పుడు సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. సో సంక్రాంతికి సీనియర్ స్టార్స్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లు రాబోతున్నారు. వీరిలో ఎవరు విజేతగా నిలుస్తారన్నది చూడాలి.
అంతకుముందు చాలాసార్లు చిరు, బాలయ్య, వెంకటేష్ బాక్సాఫీస్ దగ్గర పోటీ పడ్డారు. సంక్రాంతి టైం లో కూడా ఒకటి రెండు సార్లు తల పడ్డారు. స్టార్ సినిమాల రిలీజ్ డేట్ వ్యవహారం అంతా కన్ ఫ్యూజింగ్ గా ఉంటుంది. ఐతే ప్రస్తుతానికి ఈ మూడు సినిమాలు సంక్రాంతికి ఫిక్స్ అవగా వీటిలో ఏది ఫైనల్ అవుతుంది అన్నది చూడాలి.
Also Read : Surya 44 : తమ్ముడు ఖైదీ అన్నయ్య జైలు..?