Surya 44 : తమ్ముడు ఖైదీ అన్నయ్య జైలు..?
అక్టోబర్ 10న దసరా కానుకగా రిలీజ్ అవ్వాల్సి ఉన్నా రజిని వేటయ్యన్ కోసం ఆ సినిమాను వాయిదా వేసుకున్నారు. సినిమాను నవంబర్ 14న రిలీజ్
- By Ramesh Published Date - 10:12 AM, Sat - 14 September 24

కోలీవుడ్ స్టార్ సూర్య ప్రస్తుతం కంగువ సినిమాతో త్వరలో ప్రేక్షకులను పలకరించబోతున్నారు. ఈ సినిమా మీద సూర్య చాలా నమ్మకంగా ఉన్నారు. శివ డైరెక్షన్ లో తెరకెక్కిన కంగువ సినిమా అసలైతే అక్టోబర్ 10న దసరా కానుకగా రిలీజ్ అవ్వాల్సి ఉన్నా రజిని వేటయ్యన్ కోసం ఆ సినిమాను వాయిదా వేసుకున్నారు. సినిమాను నవంబర్ 14న రిలీజ్ చేసే ప్లానింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది.
ఈ సినిమా తర్వాత సూర్య (Surya) కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబందించిన గ్లింప్స్ చూసి ఫ్యాన్స్ మరోసారి వింటేజ్ సూర్యని చూస్తామని గట్టిగా ఫిక్స్ అయ్యారు. సూర్య 44 గా ప్రచారంలో ఉన్న ఈ సినిమా టైటిల్ జైలు (Jail) అని పెట్టబోతున్నారట. ఈ సినిమాలో సూర్య గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నారు.
సూర్య 44 సినిమాలో బుట్ట బొమ్మ..
సూర్య 44 సినిమాలో బుట్ట బొమ్మ పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో నందితాదాస్ కూడా నటిస్తుందని కోలీవుడ్ వర్గాల సమాచారం. కార్తీ లోకేష్ కనకరాజ్ కాంబోలో ఖైదీ సినిమా రాగా ఇప్పుడు సూర్య కార్తీక్ సుబ్బరాజ్ (Karthik Subbaraju) కాంబోలో జైలు సినిమా వస్తుంది. ఈ సినిమాలో సూర్యతో పాటు కార్తీ కూడా స్పెషల్ క్యామియో రోల్ చేస్తున్నట్టు సమాచారం.
సూర్య కార్తీ ఇద్దరు కలిసి కనిపిస్తే ఫ్యాన్స్ కు మంచి ట్రీట్ అందిస్తారని చెప్పొచ్చు. సూర్య 44 కచ్చితంగా ఫ్యాన్స్ కి సూపర్ ట్రీట్ అందిస్తుందని అంటున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో రిలీజ్ అయితేనే గానీ తెలియదు.
Also Read : Pope Francis : ట్రంప్, కమల ‘‘మానవ జీవిత’’ వ్యతిరేకులు : పోప్ ఫ్రాన్సిస్