Raviteja New Look : రవితేజ ఏంటి.. ఇలా అయిపోయాడు..?
Raviteja New Look : బయటకు వచ్చిన ఓ ఫోటోలో రవితేజ (Raviteja New Look) పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తున్నారు
- By Sudheer Published Date - 04:10 PM, Tue - 11 February 25

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ (Raviteja) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కొన్ని సినిమాల్లో నటించి, చివరకు హీరోగా మారి స్టార్ డమ్‌ను అందుకున్నారు. ‘ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం’ సినిమాతో పెద్ద సక్సెస్ అందుకున్న రవితేజ, ఆ తర్వాత వరుసగా హిట్ సినిమాలు అందిస్తూ అగ్ర హీరోల సరసన చేరిపోయారు. ఎప్పుడూ ఎనర్జిటిక్‌గా ఉండే రవితేజ, తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే స్టైల్ కలిగిన హీరోగా గుర్తింపు పొందారు.
Laila : బుల్లిరాజు బుగ్గ కొరికేసిన ”లైలా”
అయితే, గత కొంతకాలంగా రవితేజ కెరీర్ ఏమాత్రం బాగాలేదు. ‘ధమాకా’ సినిమా హిట్ అయినప్పటికీ, దాని తర్వాత వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ప్లాప్స్ అయ్యాయి. కొన్ని సినిమాలు విడుదలైన సంగతి కూడా ప్రేక్షకులకు తెలియకుండానే వెళ్ళిపోయాయి. దీంతో రవితేజ మార్కెట్ బాగా తగ్గింది. ఇదే సమయంలో రవితేజ తాజా లుక్ సైతం అభిమానులను , సినీ ప్రేక్షకులను షాక్ కు గురి చేస్తుంది. తాజాగా బయటకు వచ్చిన ఓ ఫోటోలో రవితేజ (Raviteja New Look) పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తున్నారు. ఆయన ముఖంలో వయస్సు ప్రభావం స్పష్టంగా కనిపిస్తుండటంతో, అభిమానులు షాక్ అవుతున్నారు. ఈ లుక్ సినిమా కోసమా..? లేక నిజంగానే ఇలా మారిపోయాడా..? అని అంత మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ప్రస్తుతం రవితేజ ‘మాస్ జాతర’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాను వచ్చే వేసవిలో విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఈ చిత్రంతో మళ్లీ తన క్రేజ్‌ను తెచ్చుకుంటాడేమో చూడాలి.