Bhagya Sri : విజయ్ దేవరకొండతో రవితేజ హీరోయిన్.. లక్ మామూలుగా లేదుగా..!
Bhagya Sri ది ఫ్యామిలీ స్టార్ తర్వాత విజయ్ దేవరకొండ తన నెక్స్ట్ సినిమా గౌతం తిన్ననూరి డైరెక్షన్ లో చేస్తున్నాడని తెలిసిందే. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యున్ ఫోర్ సినిమాస్
- By Ramesh Published Date - 09:45 AM, Sat - 1 June 24

Bhagya Sri ది ఫ్యామిలీ స్టార్ తర్వాత విజయ్ దేవరకొండ తన నెక్స్ట్ సినిమా గౌతం తిన్ననూరి డైరెక్షన్ లో చేస్తున్నాడని తెలిసిందే. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యున్ ఫోర్ సినిమాస్ కలిసి నిర్మిస్తున్నారు. స్పై థ్రిల్లర్ గా రాబోతున్న ఈ మూవీలో ఇద్దరు హీరోయిన్స్ కు నటించే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఐతే ఒక హీరోయిన్ గా భాగ్య శ్రీ బోర్స్ ని ఫైనల్ చేసినట్టు టాక్. బాలీవుడ్ లో యారియార్ 2 లో నటించిన భాగ్య శ్రీ ప్రస్తుతం మాస్ మహరాజ్ రవితేజతో మిస్టర్ బచ్చన్ సినిమాలో నటిస్తుంది.
రవితేజ సినిమాతో ఎంట్రీ ఇస్తే ఆ హీరోయిన్ కి సూపర్ క్రేజ్ ఏర్పడుతుంది. అందుకు తగినట్టుగానే భాగ్య శ్రీ బోర్స్ కి అవకాశాలు వస్తున్నాయి. విజయ్ దేవరకొండ గౌతం తిన్ననూరి కాంబో సినిమాలో భాగ్య శ్రీ దాదాపు కన్ ఫర్మ్ అయినట్టే అని చెబుతున్నారు. రవితేజ తో చేస్తున్న సినిమా పూర్తి కాకుండానే భాగ్య శ్రీకి మరో లక్కీ ఛాన్స్ వచ్చిందని చెప్పొచ్చు.
విజయ్ దేవరకొండ సినిమాలో ఛన్స్ అంటే అందులో టాలెంట్ చూపిస్తే తప్పకుండా తెలుగులో మంచి కెరీర్ సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా భాగ్య శ్రీ టాలీవుడ్ ఎంట్రీ అమ్మడికి బాగా కలిసి వచ్చేలానే ఉంది. రాబోతున్న రెండు సినిమాల్లో ఏ ఒకక్టి హిట్ అయినా కూడా భాగ్య శ్రీ తెలుగులో అదరగొట్టేయడం ఖాయమని చెప్పొచ్చు.
Also Read : Gangs Of Godhavari : గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఆ హీరో చేయాల్సిందా..?