Raviteja Mister Bacchan : రవితేజ మిస్టర్ రిలీజ్ ఎప్పుడు.. మాస్ రాజా ప్లానింగ్ ఏంటి..?
Raviteja Mister Bacchan మాస్ మహరాజ్ రవితేజ రీసెంట్ గా ఈగల్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేదు. అందుకే ఈగల్ 2 విషయంపై మేకర్స్ ఆలోచనలో
- By Ramesh Published Date - 10:15 AM, Mon - 25 March 24

Raviteja Mister Bacchan మాస్ మహరాజ్ రవితేజ రీసెంట్ గా ఈగల్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేదు. అందుకే ఈగల్ 2 విషయంపై మేకర్స్ ఆలోచనలో పడ్డారు. ప్రస్తుతం రవితేజ హరీష్ శంకర్ డైరెక్షన్ లో మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ భామ భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా జూన్ కల్లా పూర్తి చేసే ప్లానింగ్ లో ఉన్నారు మేకర్స్.
జూన్ ఫస్ట్ వీక్ లో పూర్తి చేసి ఆ నెల మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేసి ప్రమోషన్స్ మొదలు పెట్టి జూలైలో సినిమా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. రవితేజ మిస్టర్ బచ్చన్ మరోసారి మాస్ రాజా స్టామినా ఏంటో చూపించడానికి సిద్ధమవుతుంది. ఓ పక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తున్న హరీష్ శంకర్ దాన్ని మధ్యలో వదిలి పెట్టి వచ్చి రవితేజతో సినిమా చేస్తున్నాడు.
రవితేజ కూడా మిస్టర్ బచ్చన్ సెట్స్ మీద హుశారుగా కనిపిస్తున్నారట. సినిమా అవుట్ పుట్ బాగా వస్తుండటం వల్ల సినిమా తప్పకుండా టార్గెట్ రీచ్ అవుతుందని అనుకుంటున్నారు. మిరపకాయ్ తో హిట్ అందుకున్న ఈ కాంబో మళ్లీ ఇన్నాళ్లకు కలిసి పనిచేస్తున్నారు. మరి ఈ మిస్టర్ బచ్చన్ ఏం చేస్తాడో చూడాలి.
Also Read : Om Bheem Bush OTT : ఓం భీం బుష్ ఓటీటీ డీల్.. సినిమా ఎక్కడ..? ఎప్పుడు..? వస్తుంది అంటే..!