Raviteja Injured : రవితేజకు గాయాలు.యశోద హాస్పటల్ లో చికిత్స
చికిత్స చేసిన డాక్టర్స్ ఆయన్ను ఆరు వారాల పాటు రెస్ట్ తీసుకోవాలని సూచించారట
- Author : Sudheer
Date : 23-08-2024 - 8:30 IST
Published By : Hashtagu Telugu Desk
మాస్ మహారాజా రవితేజ ప్రమాదానికి (Raviteja Injured) గురయ్యాడు. ప్రస్తుతం రవితేజ RT75 మూవీ షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. ఈ క్రమంలో ఆయన షూటింగ్ లో ప్రమాదానికి గురయ్యాడు. వెంటనే మేకర్స్ యశోద హాస్పిటల్ (Yashoda Hospitals)లో జాయిన్ చేశారు. చికిత్స చేసిన డాక్టర్స్ ఆయన్ను ఆరు వారాల పాటు రెస్ట్ తీసుకోవాలని సూచించారట. రవితేజకు గాయాలు అన్న వార్త బయటకు రావడంతో ఒక్కసారిగా అభిమానులు ఆందోళన చెందారు.
We’re now on WhatsApp. Click to Join.
వాస్తవానికి ఈ ఘటన నిన్న షూటింగ్‌లో గాయమైందట. ఆ చిన్న గాయమే కదా? అని షూటింగ్‌ను కంటిన్యూ చేశాడట. అదే ఇప్పుడు సర్జరీ వరకు తీసుకెళ్లిందట. అలా షూటింగ్ చేయడంతో కుడి చేతికి శస్త్ర చికిత్స చేయాల్సి వచ్చిందట. ఆయన ఇప్పుడు క్షేమంగానే ఉన్నాడని, విశ్రాంతి తీసుకుంటున్నాడని తెలియడంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇదిలా ఉంటె రవితేజ రీసెంట్ గా మిస్టర్ బచ్చన్ (Mister Bachchan) మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.హరీష్ శంకర్ డైరెక్షన్లో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ మొదటి రోజు ..మొదటి ఆట తోనే నెగిటివ్ టాక్ సొంతం చేసుకొని , బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా మిగిలింది.
Read Also : Polio : పోలియో మళ్లీ వస్తుంది, మళ్లీ అంటువ్యాధిగా మారుతుందా.?