Rashmika Wishes: హ్యాపీ బర్త్ డే మై డియర్ పుష్పరాజ్.. బన్నీకి రష్మిక స్పెషల్ విషెస్!
అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఎప్పుడూ చూడని ఫొటోను రష్మిక షేర్ చేశారు.
- By Balu J Published Date - 10:40 AM, Sat - 8 April 23
ఇవాళ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే. ఆయన బర్త్ డే ను పురస్కరించుకొని పుష్ప ఫేం శ్రీవల్లి (రష్మిక మందన్న) ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. బర్త్ డే సందర్భంగా ఎప్పుడూ చూడని ఫొటోను రష్మిక షేర్ చేశారు. మొదటిసారి పుష్ప సినిమా కోసం రష్మిక, అల్లు అర్జున్ జత కట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీలో వీళ్లిద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను ఫిదా చేసింది. ఆన్ స్రీన్ లో మంచి కెమిస్ట్రీని పండించారు. అంతేకాదు.. ఆఫ్‌స్క్రీన్‌లో కూడా రష్మిక అల్లు అర్జున్ తో మంచి స్నేహాన్ని కొనసాగిస్తోంది.
రష్మిక తన గ్రీటింగ్స్ చెప్పడంలో అల్లు అర్జున్ కు పట్ల తన ప్రేమను ఎంటో స్పష్టం చేసింది. “నా పుష్పరాజ్ @ అల్లుఅర్జున్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ క్యాప్షన్ ఇచ్చింది. పుష్ప పాత్రలో మిమ్మల్ని తిరిగి చూడటానికి ప్రపంచం మొత్తం వేచి ఉంది. వారు మిమ్మల్ని మరింత ఎక్కువగా ప్రేమిస్తున్నారని నేను ఆశిస్తున్నాను. #తగ్గేదెలే.. మీకు చాలా ప్రేమను పంపుతున్నాను సార్ ❤️” అంటూ రియాక్ట్ అయ్యింది. వీరిద్దరి కాంబినేషన్ లో త్వరలో పుష్ప 2 – ది రూల్ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.
ఇక అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. వేషధారణలో కొత్తగా కనిపించాడు. అల్లు అర్జున్ చేతిలో ఓ గన్ కూడా కనిపించింది. ఈ లుక్ చాలా కొత్తగా ఉండటంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. పుష్ప 1లో డీ గ్లామర్ పాత్రలో గుబురు గడ్డంతో ఎర్రచందనం స్మగ్లర్ పాత్రలో బన్నీ కనిపించాడు. ఈ సారి అందుకు భిన్నంగా మరో కొత్త లుక్‌లో కనిపించాడు. దీంతో పాత లుక్‌ను చాలామంది గుర్తు చేసుకుంటున్నారు.
Happiest of birthdays to my Pushparaj @alluarjun
The entire world is waiting to watch you back in action as Pushpa and I hope they love you more and more. #Thaggedhele
Sending you lots of love sir ❤️ pic.twitter.com/taQO3pRtdu
— Rashmika Mandanna (@iamRashmika) April 8, 2023
Related News
Janasena : అల్లు అర్జున్ కూడా గ్లాస్ పట్టుకున్నాడు..ఇక తగ్గేదెలా
ఈ సాంగ్ లో అల్లు అర్జున్ గాజు గ్లాస్ పట్టుకొని ఉండడంతో ఇన్ డైరెక్ట్ గా బన్నీ జనసేన కు మద్దతు ఇస్తున్నారని చెపుతున్నారు