Rashmika Mandanna: సోషల్ మీడియాలో రష్మిక క్రేజ్.. ఇన్ స్టా ఫాలోయింగ్ లో సరికొత్త రికార్డ్
"యానిమల్" మూవీతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది నేషనల్ క్రష్ రష్మిక మందన్న.
- Author : Balu J
Date : 06-12-2023 - 12:17 IST
Published By : Hashtagu Telugu Desk
Rashmika Mandanna: “యానిమల్” మూవీతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది నేషనల్ క్రష్ రష్మిక మందన్న. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో 40 మిలియన్ల మంది ఫాలోవర్లను సంపాదించుకుంది. దీంతో డిజిటల్ రంగంలో విశేషమైన ఫీట్‌ను సాధించింది. అందానికి అందం, నటనకు నటన తోడుకావడంతో ప్రేక్షకుల మనసులను దోచకుంటోంది. ఒకవైపుసినిమాలు చేస్తూనే, మరోవైపు సోషల్ మీడియాతో తన అప్డేట్స్ ను పోస్ట్ చేస్తు ఉంటుంది. నిత్యం యాక్టివ్ గా ఉండటంతో ఈ బ్యూటీకి ఫుల్ క్రేజ్ ఏర్పడింది.
తాజాగా ఈ బ్యూటీ 40 మిలియన్ల ఫాలోయింగ్‌తో ఇన్ స్టాలో దూసుకుపోతోంది. ప్రస్తుతం రష్మిక “పుష్ప 2”, “ది గర్ల్ ఫ్రెండ్”, విక్కీ కౌశల్‌తో పాటు “చావా” అనే సినిమాలతో బిజీగా ఉంది. పుష్ప పార్ట్ 1 సినిమాలో శ్రీవల్లిగా ఆకట్టుకున్న రష్మిక టాలీవుడ్ తోపాటు బాలీవుడ్ ప్రేక్షకుల మనసులను దోచుకుంది. ఆ సినిమా విజయంతో రష్మిక క్రేజ్ ఒక్కసారిగా పెరిగింది. ప్రస్తుతం యానిమల్ మూవీ విజయం సాధించడంతో రష్మికకు బాలీవుడ్ లో వరుసగా ఆఫర్స్ క్యూ కడుతున్నాయి.
Also Read: Tirumala: నిండిన తిరుమల జలాశయాలు, నీటి కొరతకు చెక్