Rashmi Gautam : పుట్టెడు దుఃఖంలో యాంకర్ రష్మీ
- Author : Sudheer
Date : 10-03-2024 - 11:21 IST
Published By : Hashtagu Telugu Desk
యాంకర్ రష్మీ (Rashmi Gautam) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. తెలుగు బుల్లితెరపైకి యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చి.. అతి తక్కువ సమయంలోనే స్టార్‌గా మారిపోయిన బ్యూటీ రష్మీ. అందానికి అందం, టాలెంట్‌కు టాలెంట్ ఉండడంతో ఈ చిన్నది ఎనలేని గుర్తింపును సొంతం చేసుకుని ఫాలోయింగ్‌ను కూడా పెంచుకుంది. ఓ పక్క సినిమాలు చేస్తూనే..మరోపక్క బుల్లితెర యాంకర్ గా రాణిస్తూ అలరిస్తుంది. అలాగే మూగజీవాలకు ఎవరైనా హాని తలపెడితే వెంటనే సదరు వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటుంది. అలాంటి రష్మీకి ఇప్పుడు తీరని దుఃఖమే మిగిలింది. తను ఎంతో ప్రాణంగా పెంచుకుంటున్న తన పెంపుడు శునకం (Rashmi Pet Dog) ‘చుట్కీ’ని రష్మీ కోల్పోయింది.
We’re now on WhatsApp. Click to Join.
ఈ విషయాన్ని రష్మీ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది. మరణించిన కుక్కపై రష్మీ పూలమాల వేసిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎమోషనల్‌గా స్పందించింది . చుట్కీతో తాను ఎంత ప్రేమగా గడిపానో అనే విషయాన్ని తెలుపుతూ కొన్ని ఫోటోలు షేర్ చేసింది.’చుట్కీ గౌతమ్’ని కోల్పోయినందుకు చాలా బాధగా ఉందంటూ తన పెట్ డాగ్‌తో తీసుకున్న ఫొటోలను షేర్ చేసింది రష్మీ. చుట్కీ చనిపోవడానికి 24 గంటల ముందు దానితో గడిపిన ఫొటోలన్నీ షేర్ చేస్తూ చివరిలో అంత్యక్రియలు నిర్వహించి చుట్కీపై తన ప్రేమను చాటుకుంది.
Read Also : Hyderabad Woman Murder: ఆస్ట్రేలియాలో హైదరాబాద్ మహిళ దారుణ హత్య