Adipurush: శభాష్ రణబీర్.. పేద పిల్లలకు ఉచితంగా 10, 000 ఆదిపురుష్ టికెట్స్ పంపిణీ!
రిలీజ్ కు ముందే ఆదిపురుష్ మూవీ ఆసక్తి రేపుతోంది. ఈ సినిమా కోసం బాలీవుడ్ హీరో పది వేల టికెట్స్ బుక్ చేశాడు.
- By Balu J Published Date - 05:57 PM, Thu - 8 June 23

పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన ఆదిపురుష్ మూవీ రిలీజ్ కు ముందే అందర్నీ ఆకర్షిస్తోంది. ఈ మూవీ త్వరలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండటంతో చిత్ర నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఆదిపురుష్ మూవీ 10,000 టిక్కెట్లను తెలంగాణ అంతటా నిరుపేద పిల్లలు, వృద్ధాశ్రమాలకు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. రామాయణం ఆధారంగా రూపొందించబడిన ఈ ఎపిక్ మూవీకి మద్దతు ఇచ్చేందుకు రణబీర్ కపూర్ ముందుకొచ్చాడు. నిరుపేద పిల్లలకు 10,000 ఆదిపురుష్ టిక్కెట్లను విరాళంగా ఇవ్వనున్నట్టు ప్రకటించాడు.
రణబీర్ కపూర్ హిందీ చలనచిత్ర పరిశ్రమలో పేరొందిన నటులలో ఒకరు. సినిమా చూడలేని నిరుపేద పిల్లల కోసం 10,000 టిక్కెట్లను విరాళంగా ఇవ్వనున్నారు. చిన్ననాటి రోజుల్లోతాను రామాయణం నుండి చాలా నేర్చుకున్నానని, నేటి తరం పిల్లలు శ్రీరాముని కథ నుండి నేర్చుకోవాలని ఆశిస్తున్నానని అంటున్నాడు. సినిమా విడుదల రోజు 10,000 టిక్కెట్లు హిందీ బెల్ట్‌లోని NGOలకు పంపిణీ చేయబడతాయి. హీరో రణబీర్ అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో ‘యానిమల్’ మూవీతో బిజీగా ఉన్నాడు.
ఆదిపురుష్ గురించి చెప్పాలంటే 500 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2డి, 3డిలో విడుదల కానుంది. ఆదిపురుష్ కోసం అడ్వాన్స్ బుకింగ్ త్వరలోనే ప్రారంభమవుతుంది. ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రల్లో భూషణ్ కుమార్ నిర్మించిన ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఆదిపురుష్ జూన్ 16, 2023న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది.