Rana Naidu 2 : రానా నాయుడు 2 మొదలైంది..!
రానా నాయుడు సీరీస్ ను కరణ్ అన్షుమన్, సుపర్న్ వర్మ, అభయ్ చోప్రా డైరెక్ట్ చేశారు. నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్స్ (Netflix Originals) గా వచ్చిన ఈ వెబ్ సీరీస్ లాస్ట్ ఇయర్
- By Ramesh Published Date - 03:10 PM, Tue - 23 July 24

విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh,) సినిమాలతోనే కాదు వెబ్ సీరీస్ లతో కూడా అదరగొట్టేస్తాడని రానా నాయుడు సీరీస్ తో అర్ధమైంది. ఐతే ఆ సీరీస్ లో ఇన్నాళ్లు వెంకటేష్ కు ఉన్న ఇమేజ్ ని కాస్త మార్చే ప్రయత్నం చేశారు. తెలుగులో ఆయన ఒక క్లాసిక్ హీరో అలాంటి ఆయన్ను తీసుకెళ్లి ఒక బోల్డ్ రోల్ చేయించారు. రానా నాయుడు సీరీస్ లో వెంకటేష్ ని చూసి ఆయన ఫ్యాన్స్ కూడా షాక్ అయ్యారు.
రానా నాయుడు సీరీస్ ను కరణ్ అన్షుమన్, సుపర్న్ వర్మ, అభయ్ చోప్రా డైరెక్ట్ చేశారు. నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్స్ గా వచ్చిన ఈ వెబ్ సీరీస్ లాస్ట్ ఇయర్ సూపర్ హిట్ సీరీస్ లో ఒకటిగా నిలిచింది. ఐతే రానా నాయుడు సెకండ్ సీజన్ కోసం ఫ్యాన్స్ అంతా ఎంతంగానో ఎదురుచూశారు. ఐతే నెట్ ఫ్లిక్స్ (Netflix Originals) ఈ సీరీస్ సీజన్ 2 మొదలు పెట్టింది.
రీసెంట్ గా ఈ సీరీస్ ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కాగా ఇప్పుడు రానా నాయుడు 2 (Rana Naidu 2) షూటింగ్ టాప్ గేర్ లో జరుగుతుంది. రానా నాయుడు 2 సీరీస్ ని సౌత్ ఆడియన్స్ అంతగా మెచ్చలేదు కానీ నార్త్ సైడ్ ఆడియన్స్ ఆ సీరీస్ ని తెగ చూసేశారు. వెంకటేష్ మరోసారి తన బోల్డ్ టాక్ తో రానా నాయుడు 2 లో అదరగొట్టబోతున్నాడు
ఈ సీరీస్ తో వెంకటేష్ తాను వెబ్ సీరీస్ లకు కూడా సిద్ధమే అని ప్రూవ్ చేశారు. రానా నాయుడు సీరీస్ లో రానా కూడా బాగా నటించాడు. దగ్గుబాటి హీరోల మల్టీస్టారర్ (Daggubati Multistarrer) సీరీస్ గా రానా నాయుడు సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. నెట్ ఫ్లిక్స్ లో రిలీజైన రానా నాయుడు సీరీస్ సూపర్ హిట్ కాగా సీరీస్ 2 కోసం కూడా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
Also Read : Hypder Aadi : అల్లు అర్జున్ ని ట్రోల్ చేయొద్దు.. మెగా ఫ్యాన్స్ కి ఆది రిక్వెస్ట్..!