Double Ismart premiers : డబుల్ ఇస్మార్ట్ పండుగ ముందే.. పూరీ ప్లానింగ్ అదుర్స్..!
లైగర్ తర్వాత పూరీ చేస్తున్న ఈ అటెంప్ట్ మీద ఆయన ఫ్యాన్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. పూరీ రామ్ ఇద్దరు కలిసి చేసిన ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ కాగా అదే రిజల్ట్ రిపీట్
- Author : Ramesh
Date : 23-07-2024 - 10:04 IST
Published By : Hashtagu Telugu Desk
Double Ismart premiers పూరీ జగన్నాథ్ రామ్ (Ram) కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా డబుల్ ఇస్మార్ట్. ఈ సినిమాను పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్ కలిసి నిర్మిస్తున్నారు. కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను ఆగష్టు 15న రిలీజ్ లాక్ చేశారు. లైగర్ తర్వాత పూరీ చేస్తున్న ఈ అటెంప్ట్ మీద ఆయన ఫ్యాన్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. పూరీ రామ్ ఇద్దరు కలిసి చేసిన ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ కాగా అదే రిజల్ట్ రిపీట్ చేయాలని భావిస్తున్నారు.
ఆగష్టు 15న రిలీజ్ వస్తుండగా ముందే ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. పూరీ ఈ సినిమా మీద సూపర్ కాన్ఫిడెంట్ గా ఉండటంతో ముందే డబుల్ ఇస్మార్ట్ ని చూపించాలని చూస్తున్నాడు. డబుల్ ఇస్మార్ట్ సినిమాను రిలీజ్ కు ఒకరోజు ముందు అంటే ఆగష్టు 14న స్పెషల్ ప్రీమియర్స్ (Premiers) ప్లాన్ చేస్తున్నారట. అదే నిజమైతే ఒకరోజు ముందే డబుల్ ఇస్మార్ట్ సినిమా సందడి షురూ అవుతుంది.
రామ్, పూరీ (Puri Jagannath) ఇద్దరు కలిసి మరో సారి మ్యాజిక్ రిపీట్ చేయాలని చూస్తున్నారు. రామ్ కూడా ది వారియర్, స్కంద సినిమాలు ఫ్లాప్ ఫేస్ చేశాడు. అందుకే డబుల్ ఇస్మార్ట్ మీద రామ్ కూడా ఫోకస్ పెట్టాడు. మరి ఈ సినిమా డైరెక్టర్ హీరో కాంబోని మళ్లీ హిట్ చేస్తుందా లేదా అన్నది చూడాలి.
ఈ సినిమాకు మణిశర్మ అందించే మ్యూజిక్ ప్రేక్షకులను అలరించేలా ఉంది. ఈమధ్యనే రిలీజైన సాంగ్ సూపర్ హిట్ కాగా ఆల్బం మొత్తం అదరగొట్టబోతుందని తెలుస్తుంది. ఆగష్టు 15న డబుల్ ఇస్మార్ట్ తో పాటుగా రవితేజ మిస్టర్ బచ్చన్ కూడా రిలీజ్ అవుతుంది. రెండు సినిమాల మధ్య ఆసక్తికరమైన ఫైట్ జరుగుతుంది. రెండు మాస్ ఆడియన్స్ టార్గెట్ తోనే వస్తున్న సినిమాలు అవ్వడం విశేషం.
Also Read : Nag Aswin : కల్కి 2 భాగాలు.. చిట్టిలు వేసి డిసైడ్ చేశారా..?