Ram Charan : చరణ్ 16.. ఆ టైటిల్ జస్ట్ రూమర్ మాత్రమేనా..?
ఐతే చరణ్ 16వ సినిమా పెద్ది (Peddi) టైటిల్ ఫిక్స్ అని కొందరు అంటుండగా చిత్ర యూనిట్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పెద్ది టైటిల్ కన్ఫర్మ్ కాదని అంటున్నారు
- By Ramesh Published Date - 02:42 PM, Thu - 18 July 24

గ్లోబల్ స్టార్ రాం చరణ్ (Ram Charan) ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. శంకర్ డైరెక్షన్ లో రీసెంట్ గా వచ్చిన ఇండియన్ 2 ఫ్లాప్ అవ్వడం వల్ల గేం చేంజర్ విషయంలో కూడా మెగా ఫ్యాన్స్ భయపడుతున్నారు. ఐతే గేమ్ చేంజర్ తప్పనిసరిగా ఫ్యాన్స్ ని అలరించేలా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతున్నారు.
ఇదిలాఉంటే చరణ్ 16వ సినిమా బుచ్చి బాబు డైరెక్షన్ లో చేస్తున్నాడని తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ (Mytri Movie Makers) నిర్మిస్తున్న ఈ సినిమాలో చరణ్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు టాక్. ఐతే పెద్ది అనేది తెలుగు వరకు వర్క్ అవుట్ అయినా పాన్ ఇండియా లెవెల్ లో అంతగా బాగోదని కొందరి అభిప్రాయం.
ఐతే చరణ్ 16వ సినిమా పెద్ది (Peddi) టైటిల్ ఫిక్స్ అని కొందరు అంటుండగా చిత్ర యూనిట్ నుంచి వచ్చిన ఇన్ ఫర్మేషన్ ప్రకారం పెద్ది టైటిల్ కన్ ఫర్మ్ కాదని అంటున్నారు. మేకర్స్ ఇంకా టైటిల్ ని ఫైనల్ చేయలేదని. సినిమాకు అందరు మెచ్చే టైటిల్ నే పెట్టే ఆలోచనలో ఉన్నారట. ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ కూడా భాగం అవుతున్నారు.
చరణ్ తో జాన్వి కపూర్ (Janhvi Kapoor) జోడీ కడుతున్న ఈ సినిమాకు రెహమాన్ మ్యూజిక్ అందించడం కూడా ప్రత్యేకంగా నిలుస్తుంది. ఆల్రెడీ సినిమాకు సంబందించి రెహమాన్ రెండు సాంగ్స్ ఇచ్చేశాడని తెలుస్తుంది. ఈమధ్య తెలుగు సినిమాలకు పూర్తిగా దూరమైన రెహమాన్ ను మళ్లీ చరణ్ సినిమాతో తీసుకొస్తున్నారు.
Also Read : AP People : పవన్ కళ్యాణ్ ఫై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారా..?