Surekha Konidela : రామ్ చరణ్ పుట్టిన సందర్భంగా తల్లి చేసిన పని.. తెలిస్తే ఆశ్చర్యపోతారు..
రామ్ చరణ్ తల్లి సురేఖ కొణిదల తన కొడుకు పుట్టిన రోజు సందర్భంగా ఓ మంచి పనిచేసింది.
- By News Desk Published Date - 06:11 PM, Tue - 26 March 24

రేపు మార్చ్ 27 రామ్ చరణ్(Ram Charan) పుట్టిన రోజు అని తెలిసిందే. ప్రస్తుతం రామ్ చరణ్ RRR సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకొని సూపర్ ఫామ్ లో ఉన్నాడు. దీంతో ఈ సారి చరణ్ బర్త్ డేని మరింత గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడానికి అభిమానులు సిద్దమైపోతున్నారు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ తల్లి సురేఖ కొణిదల(Surekha Konidela) తన కొడుకు పుట్టిన రోజు సందర్భంగా ఓ మంచి పనిచేసింది.
అపోలో హాస్పిటల్ లో ఉన్న ఆలయానికి గత మూడు రోజులుగా పుష్కరోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించగా చినజీయర్ స్వామి కూడా హాజరయి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కామినేని, కొణిదెల ఫ్యామిలీలు ఈ పూజల్లో పాల్గొన్నారు. ఈ పూజలకు అనేక మంది భక్తులు కూడా వచ్చారు. దీంతో రేపు రామ్ చరణ్ పుట్టిన రోజు కూడా ఉండటంతో ఈ పుష్కరోత్సవ కార్యక్రమంలో 500 మందికి నేడు అన్నదానం నిర్వహించారు.
ఇటీవల సురేఖ కొణిదెల అత్తమ్మస్ కిచెన్ అనే ఫుడ్ బిజినెస్ స్థాపించింది. దీంట్లో అన్ని రకాల పొడులు, పచ్చళ్ళు, స్పాట్ లో మిక్స్ చేసుకొని తయారుచేసుకునే వంట పదార్థాలు దొరుకుతాయి. సురేఖ తన అత్తమ్మస్ కిచెన్ తరపున దగ్గరుండి ఫుడ్ వడ్డించి దాదాపు 500 మందికి రామ్ చరణ్ పేరిట అన్నదానం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఉపాసనతో పాటు మెగా ఫ్యామిలిలో పలువురు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని వీడియో రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ గా మారింది. దీంతో చరణ్ అభిమానులు సంతోషిస్తున్నారు. చరణ్ కూడా అప్పుడప్పుడు తన తల్లి కోసం వండిన వంటలను ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.
Also Read : Game Changer : గేమ్ ఛేంజర్ సినిమా పాన్ ఇండియా రిలీజ్ కాదా? ఆ పోస్టర్ తో అభిమానులు నిరాశ..