Ram Charan Game Changer : మెగా ఫ్యాన్స్ కి గేమ్ ఛేంజర్ కానుక..!
సినిమా రిలీజ్ డేట్ పై కన్ ఫ్యూజన్ కొనసాగగా ఫైనల్ గా నిర్మాత దిల్ రాజు క్రిస్ మస్ కి గేమ్ ఛేంజర్ వస్తుందని చెప్పి ఖుషి చేశారు. ఐతే రిలీజ్ డేట్ చెప్పారు సరే అప్డేట్స్ ఎక్కడ అంటూ మెగా ఫ్యాన్స్
- By Ramesh Published Date - 09:38 AM, Thu - 29 August 24

మెగా పవర్ స్టార్ రాం చరణ్ శంకర్ కాంబోలో వస్తున్న గేమ్ ఛేంజర్ అప్డేట్స్ కోసం మెగా ఫ్యాన్స్ అంతా ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న గేమ్ ఛేంజర్ విషయంలో ఫ్యాన్స్ కాస్త అసంతృప్తిగా ఉన్నారు. మొన్నటిదాకా సినిమా రిలీజ్ డేట్ పై కన్ ఫ్యూజన్ కొనసాగగా ఫైనల్ గా నిర్మాత దిల్ రాజు క్రిస్ మస్ కి గేమ్ ఛేంజర్ వస్తుందని చెప్పి ఖుషి చేశారు. ఐతే రిలీజ్ డేట్ చెప్పారు సరే అప్డేట్స్ ఎక్కడ అంటూ మెగా ఫ్యాన్స్ ప్రొడక్షన్ హౌజ్ ని ఎటాక్ చేస్తున్నారు.
ఈ క్రమంలో చిత్ర యూనిట్ కూడా గేమ్ ఛేంజర్ (Game Changer) అప్డేట్ ఇచ్చేందుకు రెడీ అవుతుంది. గేమ్ ఛేంజర్ సినిమా నుంచి త్వరలో టీజర్ రాబోతుందని తెలుస్తుంది. శంకర్ డైరెక్షన్ లో వస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాను అంచనాలను మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఐతే ఈ సినిమా టీజర్ (Teaser) ని సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో వినాయక చవితి కానుకగా రిలీజ్ చేస్తారని టాక్.
సెప్టెంబర్ 7న గణేష్ చతుర్ధి కాగా ఆరోజు మెగా ఫ్యాన్స్ కు కానుకగా గేమ్ ఛేంజర్ టీజర్ వదులుతారని తెలుస్తుంది. గేమ్ ఛేంజర్ శంకర్ మార్క్ సోషల్ మెసేజ్ తో వస్తుందని తెలుస్తుండగా చరణ్ (Ram Charan) నుంచి మెగా ఫ్యాన్స్ ఆశిస్తున్న అన్ని కమర్షియల్ హంగులు ఉన్నాయని తెలుస్తుంది. గేమ్ ఛేంజర్ సినిమా విషయంలో మెగా ఫ్యాన్స్ మాత్రం తారాస్థాయి అంచనాలతో ఉన్నారు. ఐతే వాటికి ఏమాత్రం తగ్గకుండా ఉండాలనే సినిమాను చాలా జాగ్రత్తగా చేస్తున్నారు.
థమన్ మ్యూజిక్ అందిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాలో చరణ్ తో కియరా అద్వాని జత కడుతుంది. డిసెంబర్ చివర్లో క్రిస్ మస్ రేసులో గేమ్ ఛేంజర్ రిలీజ్ అవుతుండగా పాన్ ఇండియా లెవెల్ లో మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు చరణ్.
Also Read : Bhagya Sree : భాగ్య శ్రీకి మరో బంపర్ ఆఫర్..!