Bhagya Sree : భాగ్య శ్రీకి మరో బంపర్ ఆఫర్..!
విజయ్ తో సినిమా అంటే యూత్ ఆడియన్స్ అంతా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమా అవకాశాన్ని
- By Ramesh Published Date - 09:28 AM, Thu - 29 August 24

మాస్ మహరాజ్ రవితేజ హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది భాగ్య శ్రీ బోర్స్. అంతకుముందు బాలీవుడ్ లో రెండు సినిమాల్లో నటించిన భాగ్య శ్రీ టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. రిలీజ్ ముందు ప్రమోషన్స్ తో హుశారెత్తించిన మిస్టర్ బచ్చన్ రిలీజ్ తర్వాత చతికిల పడ్డది. ఐతే భాగ్య శ్రీకి మాత్రం మంచి బజ్ ఏర్పడేలా చేసింది. సినిమా ఎవరికి ఏం లాభం చేయకపోయినా భాగ్య శ్రీకి మాత్రం క్రేజ్ వచ్చేలా చేసింది.
ఆ క్రేజ్ తోనే నెక్స్ట్ సినిమా విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) సినిమా ఛాన్స్ అందుకుంది భాగ్య శ్రీ (Bhagya Sree). గౌతం తిన్ననూరి డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమాలో అమ్మడు నటిస్తుంది. విజయ్ తో సినిమా అంటే యూత్ ఆడియన్స్ అంతా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమా అవకాశాన్ని దక్కించుకుంది భాగ్య శ్రీ. రానా దగ్గుబాటి నిర్మాతగా దుల్కర్ సల్మాన్ హీరోగా చేస్తున్న కాంత (Kantha) సినిమాలో భాగ్య శ్రీని హీరోయిన్ గా లాక్ చేశారట.
Also Read : Rajasekhar : మగాడు టైటిల్ తో యాంగ్రీ యంగ్ మ్యాన్..!
రానా, దుల్కర్ ఇద్దరి హీరోలు కలిసి చేస్తున్న సినిమాలో భాగ్య శ్రీ ఛాన్స్ దక్కించుకోవడం లక్కీ అని చెప్పొచ్చు. భాగ్య శ్రీ బోర్స్ తెలుగులో నెక్స్ట్ బిగ్ స్టార్ హీరోయిన్ అవుతుందని కొందరు అంటున్నారు. ఐతే ఫస్ట్ సినిమా హిట్ పడితే ఆ లెక్క వేరేలా ఉంటుంది. కానీ అమ్మడికి మిస్టర్ బచ్చన్ పెద్ద షాక్ ఇచ్చింది. మరి రెండో సినిమా అయినా అమ్మడికి హిట్ అందిస్తుందా లేదా అన్నది చూడాలి.
భాగ్య శ్రీ థర్డ్ మూవీ దుల్కర్ తో చేస్తుంది. కాంత సినిమాతో కూడా భాగ్య శ్రీ మరోసారి తన సత్తా చాటేందుకు సిద్ధంగా ఉందని తెలుస్తుంది.