Cinema Love: రామ్ చరణ్, రానా దగ్గుబాటి ‘బ్రోమాన్స్’ గోల్స్
న్యూ ఈయర్ సందర్భంగా నటుడు రానా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. రాం చరణ్ తో తాను దిగిన ఫోటోని రానా షేర్ చేసాడు. ఆ పిక్ లో రానా రాం చరణ్ కౌగిలించుకొని ఉన్నారు.
- By Hashtag U Published Date - 06:11 PM, Sun - 2 January 22

న్యూ ఈయర్ సందర్భంగా నటుడు రానా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. రాం చరణ్ తో తాను దిగిన ఫోటోని రానా షేర్ చేసాడు. ఆ పిక్ లో రానా రాం చరణ్ కౌగిలించుకొని ఉన్నారు.
తాను వైల్డ్ అవ్వకుండా గత మూడు దశాబ్దాలుగా తనని పట్టుకున్నాడని, తెలిపిన రానా రాం చరణ్ కి న్యూ ఈయర్ గ్రీటింగ్స్ చెప్పాడు.
రానా, రాం చరణ్ స్నేహం గురించి అందరికీ తెలిసిందే. వారిద్దరూ చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్, క్లాస్ మేట్స్ కూడా. ఈ విషయాన్ని ఇద్దరూ పలు సందర్భాల్లో పలు వేదికలపై ప్రస్తావించారు.
ఇక ప్రస్తుతం ఇద్దరు నటులు బిజీబిజీగా తమ కెరీర్లు లీడ్ చేస్తున్నారు. మెగా ఫ్యామిలీతో సినిమాల్లోకి అరంగేట్రం చేసినా, మగధీర సినిమాతో రాం చరణ్ తనని ప్రూవ్ చేసుకున్నాడు. ఇక రానా బాహుబలితో ఒక రేంజ్ కి వెళ్ళిపోయాడు. ఈ ఇద్దరే కాకుండా రెండు ఫ్యామిలీలు కూడా స్నేహంగా ఉంటాయి.