Rakhi Sawant: నా భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడంటూ రాఖీ సావంత్ కన్నీళ్లు!
సినిమా ఇండస్ట్రీకి చెందిన కొంతమంది జీవితాలు ఎప్పుడూ వివాదాల చుట్టూ తిరుగుతుంటాయి. బాలీవుడ్ లో ఇలా వివాదాదలకు కేరాఫ్ గా నిలిచే వ్యక్తి రాఖీ సావంత్.
- By Nakshatra Published Date - 09:43 PM, Mon - 6 February 23
Rakhi Sawant: సినిమా ఇండస్ట్రీకి చెందిన కొంతమంది జీవితాలు ఎప్పుడూ వివాదాల చుట్టూ తిరుగుతుంటాయి. బాలీవుడ్ లో ఇలా వివాదాదలకు కేరాఫ్ గా నిలిచే వ్యక్తి రాఖీ సావంత్. ఒకప్పుడు ఐటమ్ సాంగ్స్ తో ఊపేసిన ఈ బాలీవుడ్ భామ.. తర్వాతి కాలంలో బిగ్ బాస్ లో తముక్కుమనింది. వివాదాలతో వార్తల్లో నిలిచే రాఖీ సావంత్.. మరోసారి తన పెళ్లి విషయంలో మీడియా ముందుకు వచ్చేసింది.
మొన్నీ మధ్యనే తాను ఓ అబ్బాయిని పెళ్లి చేసుకోవడంతో పాటు తాను మతం కూడా మారినట్లు బాలీవుడ్ భామ రాఖీ సావంత్ వెల్లడించింది. అయితే ఈ విషయంలో ఇద్దరికి వివాదం తలెత్తగా.. తాజాగా తామిద్దరి మధ్య అంతా బాగానే ఉందని రాఖీ ప్రకటించింది. దీంతో అంతా సర్దుమణిగిందని అనుకునేలోపే.. రాఖీ భర్తగా చలామణి అవుతున్న వ్యక్తి ఈ పెళ్లే ఫేక్ అని అన్నాడు. దీంతో వివాదం మళ్లీ మొదటికి వచ్చేసింది.
రాఖీ సావంత్, అదిల్ దురానీ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోగా.. తాజాగా రాఖీ సావంత్ తన భర్త మీద తీవ్ర ఆరోపణలు చేసింది. తన భర్త వేరే అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని మీడియా ముందు బోరుమంది. ‘నన్ను మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేస్తున్నాడు’ అని రాఖీ సావంత్ మీడియా ముందు తన గోడును వినిపించింది.
‘అదిల్.. తను అనే అమ్మాయితోనే ఉండాలని నిర్ణయం తీసుకున్నాడు. బాలీవుడ్ లో నా సొంత కష్టంతోనే ఎదిగాను. బాలీవుడ్ ల సంపాదించిన నా డబ్బు అంతా అదిల్ తీసుకున్నాడు. నా వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి. ఫిజికల్ గా, మెంటల్ గా, ఎమోషనల్ గా నన్ను టార్చర్ చేశాడు. పెళ్లి తర్వాత అతనిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని తెలిసింది. అదిల్ తనను అత్యంత దారుణంగా హింసించాడు’ అని బాలీవుడ్ నటి రాఖీ సావంత్ మీడియా కు వివరించింది.
Related News
Urvashi Rautela : క్రికెటర్ గురించి హాట్ బ్యూటీ నో కామెంట్ అనేస్తుంది..!
Urvashi Rautela బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతెలా బాలీవుడ్ ఆడియన్స్ ని తన మత్తులో పడేస్తున్న విషయం తెలిసినే. గ్లామర్ షోలో తన తర్వాతే ఎవరైనా అనే రేంజ్ లో