Rajamouli Love Track : యాంకర్ రష్మీ తో రాజమౌళి లవ్ ట్రాక్
Rajamouli Love Track : సింహాద్రి’, ‘విక్రమార్కుడు’, ‘యమదొంగ’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలతో సూపర్‌హిట్ దర్శకుడిగా ఎదిగిన రాజమౌళి
- By Sudheer Published Date - 03:54 PM, Wed - 19 February 25

టాలీవుడ్ స్టార్ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి (Rajamouli) సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే దర్శకుడిగానే కాకుండా నటుడిగానూ ఆయన మంచి ప్రావీణ్యం కలిగి ఉన్నారు. ‘మజ్ను’, ‘కల్కి’ వంటి సినిమాల్లో చిన్న క్యామియో రోల్స్ చేసిన రాజమౌళి.. తన అనుభవంతో ప్రేక్షకులను మెప్పించారు. దర్శకుడిగా గుర్తింపు పొందడానికి ముందు ఆయన కొన్ని టీవీ సీరియళ్లలో కూడా నటించారు. ముఖ్యంగా గుణ్ణం గంగరాజు నిర్మించిన ‘అమృతం’ సీరియల్‌లో ఓ ఎపిసోడ్‌లో నటించగా, అక్కినేని నాగార్జున నిర్మించిన ‘యువ’ (Yuva) సీరియల్‌లో కూడా రాజమౌళి కనిపించారు.
BSNL : బీఎస్‌ఎన్‌ఎలా మజాకా..సిమ్ కార్డు లేకుండానే కాల్స్ చేసుకోవచ్చు
ఇప్పుడీ ‘యువ’ సీరియల్‌లోని ఓ ఎపిసోడ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఎపిసోడ్‌లో యాంకర్ రష్మీ గౌతమ్ (Rashmi Gautam) ప్రధాన పాత్రలో నటించగా, రాజమౌళి అక్కడ స్వయంగా తన పాత్రనే పోషించారు. కాగా రష్మీ, రాజమౌళిల మధ్య లవ్ ట్రాక్ కూడా రాశారు. అప్పటికే ‘సింహాద్రి’, ‘విక్రమార్కుడు’, ‘యమదొంగ’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలతో సూపర్‌హిట్ దర్శకుడిగా ఎదిగిన రాజమౌళి, ఇలాంటి టీవీ క్యామియోలో నటించడాన్ని చాలామంది ఆశ్చర్యంగా చూస్తున్నారు.
Kumari Aunty : రేవంత్ ఫోటో తో మరోసారి కుమారి ఆంటీ వైరల్
ప్రస్తుతం పాన్ వరల్డ్ డైరెక్టర్‌గా ఎదిగిన రాజమౌళి ఓ కాలంలో సీరియల్లో చిన్న పాత్రలు పోషించడం నెటిజన్లకు కొత్త ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ వీడియోను చూసిన యువత “జక్కన్న ఇలాంటి పాత్రలో కూడా నటించారా?” అంటూ కామెంట్లు చేస్తున్నారు. చిన్న పాత్ర అయినప్పటికీ, తన అభినయంతో ఆకట్టుకున్న రాజమౌళిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Whatt..Rajamouli and Rashmi Acting In Yuva serial..👀😱😱
Romantic Love story❤️😂🤣#Rajamouli pic.twitter.com/zofhVOZNgZ— MawaNuvvuThopu (@MawaNuvvuThopu) February 18, 2025