Raja Saab : రాజా సాబ్ బ్లాక్ బస్టర్ సాంగ్స్ పక్కానా..?
సినిమా మ్యూజిక్ గురించి థమన్ ఈమధ్య ఒక హింట్ ఇచ్చాడు. రాజా సాబ్ సాంగ్స్ అన్ని బ్లాక్ బస్టర్ అంటూ చెప్పేశాడు. మారుతి సినిమాల్లో సాంగ్స్ ప్రత్యేకంగా
- Author : Ramesh
Date : 24-07-2024 - 8:15 IST
Published By : Hashtagu Telugu Desk
Raja Saab రెబల్ స్టార్ ప్రభాస్ (Rebal Star Prabhas) హీరోగా మారుతి డైరెక్షన్ లో వస్తున్న సినిమా రాజా సాబ్. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా లో ప్రభాస్ వింటేజ్ లుక్ ఫ్యాన్స్ కి ఫుల్ జోష్ అందిస్తుందని అంటున్నారు. ప్రభాస్ లోని కామెడీ సెన్స్, టైమింగ్ మొత్తం వాడేయాలని ఫిక్స్ అయ్యాడు మారుతి. సాధారణంగానే తన కామెడీ సినిమాలతో అలరించే మారుతి ఈసారి ప్రభాస్ లాంటి స్టార్ హీరోతో ఆ ప్రయత్నం చేస్తున్నాడు.
రాజా సాబ్ సినిమాలో మాళవిక మోహనన్ (Malavika Mohanan), నిధి అగర్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ (Thaman) మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమా మ్యూజిక్ గురించి థమన్ ఈమధ్య ఒక హింట్ ఇచ్చాడు. రాజా సాబ్ సాంగ్స్ అన్ని బ్లాక్ బస్టర్ అంటూ చెప్పేశాడు. మారుతి సినిమాల్లో సాంగ్స్ ప్రత్యేకంగా ఉంటాయి. కథకు తగినట్టుగా పాటలు తీసుకోవడం ఆయనకు అలవాటు.
ఇక ఈమధ్య వరుస సినిమాలతో సూపర్ ఫాం లో ఉన్న థమన్ రాజా సాబ్ కోసం అదిరిపోయే మ్యూజిక్ అందిస్తాడని తెలుస్తుంది. రాజా సాబ్ సాంగ్స్ పై థమన్ చేసిన కామెంట్స్ ఫ్యాన్స్ కి సూపర్ కిక్ ఇస్తుంది. సినిమాను అసలైతే డిసెంబర్ లో రిలీజ్ చేయాలని అనుకున్నారు కానీ ఇప్పుడు 2025 సంకాంతికి సినిమా వచ్చేలా ఉంది.
సలార్ 1 తర్వాత రీసెంట్ గా కల్కి 2898 ఏడితో సెన్సేషనల్ హిట్ అందుకున్న ప్రభాస్ రాబోతున్న రాజా సాబ్ తో కూడా నెక్స్ట్ లెవెల్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో హంగామా చేస్తుందో చూడాలి. ఈ సినిమా తర్వాత ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో స్పిరిట్ సినిమా చేయనున్నాడు. ఈ సినిమా మీద ఆడియన్స్ కి అయితే తారాస్థాయిలో అంచనాలు ఉన్నాయి.