Megastar Chiranjeevi Viswambhara : విశ్వంభర బిజినెస్ కు భారీ డిమాండ్..!
సెట్స్ మీద ఉండగానే చిరు సినిమాకు అదిరిపోయే బిజినెస్ డీల్స్ వస్తున్నాయని తెలుస్తుంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం విశ్వంభర (Viswambhara) సినిమాకు
- By Ramesh Published Date - 09:46 PM, Tue - 27 August 24

మెగాస్టార్ చిరంజీవి వశిష్ట డైరెక్షన్ లో వస్తున్న విశ్వంభర సినిమా సెట్స్ మీద ఉంది. యువి క్రియేషన్స్ బ్యానర్ లో వంశీ ప్రమోద్ 200 కోట్ల పైన బడ్జెట్ తో ఈ సినిమా నిర్మిస్తున్నారు. సినిమాలో త్రిష (Trisha) హీరోయిన్ గా నటిస్తుండగా మీనాక్షి చౌదరి, ఆషిక రంగనాథ్ లాంటి భామలు నటిస్తున్నారు. కీరవాణి మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను 2025 జనవరి 10న రిలీజ్ లాక్ చేశారు.
ఐతే సెట్స్ మీద ఉండగానే చిరు సినిమాకు అదిరిపోయే బిజినెస్ డీల్స్ వస్తున్నాయని తెలుస్తుంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం విశ్వంభర (Viswambhara) సినిమాకు నైజాం, సీడెడ్, ఏపీ ఏరియాల కోసం 120 కోట్ల దాకా బిజినెస్ డీల్ వచ్చిందట. నిర్మాతలు కూడా దాదాపు ఓకే అన్నట్టు టాక్. ఒక యువ నిర్మాత విశ్వంభర సినిమా హక్కులను తెలుగు రెండు రాష్ట్రాల్లో కొనేసినట్టు తెలుస్తుంది.
Megastar Chiranjeevi చిరంజీవి ఈమధ్య రొటీన్ సినిమాలు చేస్తున్నారని ఆడియన్స్ అంటునారు. అందుకే ఈసారి తన మార్క్ వర్సటాలిటీ చూపించేలా చిరు విశ్వంభర చేస్తున్నారు. ఈ సినిమాపై డైరెక్టర్ వశిష్ట కూడా ఎన్ని అంచనాలతో వచ్చినా సరే ఫ్యాన్స్ కి ఫీస్ట్ పక్కా అని చెబుతున్నాడు. చిరంజీవి జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా తరహాలో విశ్వంభర కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని అంటున్నారు.
అంతేకాదు విశ్వంభర సినిమాతో మెగాస్టార్ చిరంజీవి పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్నారు. మరి ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఉంటుందా లేదా అన్నది చూడాలి. ఈ సినిమా విషయంలో ప్రతి యాస్పెక్ట్ చాలా ఫోకస్ గా డైరెక్టర్ వశిష్ట ప్లాన్ చేస్తున్నారు. సినిమా తో మెగా మేనియా ఏంటో చూపించాలని చిరు కూడా రెడీగా ఉన్నారు.
Also Read : Naga Chaitanya : తండేల్ చాలా పెద్ద ప్లానింగే..!