OG Pre Release : పవన్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్ ..OG ప్రీ రిలీజ్ కు వర్షం అడ్డంకి.!!
OG Pre Release : పవన్ కళ్యాణ్ అభిమానులకు బ్యాడ్ న్యూస్..OG ప్రీ రిలీజ్ (OG Pre Release) వేడుకకు వర్షం అడ్డంకిగా మారింది. హైదరాబాద్ లోని LB స్టేడియం లో అట్టహాసంగా ఈవెంట్ మొదలు అయ్యిందో లేదో..వర్షం కూడా మొదలైంది. మరికాసేపట్లో హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం పడనుందని వాతావరణ శాఖ తెలియజేయడం తో అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు.
- By Sudheer Published Date - 08:25 PM, Sun - 21 September 25

పవన్ కళ్యాణ్ అభిమానులకు బ్యాడ్ న్యూస్..OG ప్రీ రిలీజ్ (OG Pre Release) వేడుకకు వర్షం అడ్డంకిగా మారింది. హైదరాబాద్ లోని LB స్టేడియం లో అట్టహాసంగా ఈవెంట్ మొదలు అయ్యిందో లేదో..వర్షం కూడా మొదలైంది. మరికాసేపట్లో హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం పడనుందని వాతావరణ శాఖ తెలియజేయడం తో అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. వాస్తవానికి 6 గంటలకు ఈవెంట్ మొదలు అవుతుందని అంత భావించారు కానీ ఈవెంట్ 8 గంటలకు స్టార్ట్ అయ్యింది. ఈ లోపే వర్షం కూడా మొదలైంది. రాజేంద్ర నగర్, చార్మినార్, ఎల్బీ నగర్, ఉప్పల్, ఖైరతాబాద్, అబిడ్స్, సికింద్రాబాద్, కాప్రా, మల్కాజ్గిరి ప్రాంతాల్లో వర్షాలకు ఛాన్స్ ఉందని పేర్కొంది.
CM Revanth Medaram Visit: ఈనెల 23న మేడారంలో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
ఇక OG విషయానికి వస్తే ..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం “ఓజీ”” సినీ ప్రేమికుల్లో అమితాసక్తి రేకెత్తిస్తోంది. సుజిత్ దర్శకత్వం వహించిన ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా పవన్ కళ్యాణ్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందనే అంచనాలు ఉన్నాయి. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ “ఓమీ”గా విలన్ పాత్రలో కనిపించడం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. అలాగే శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, జగపతి బాబు, ప్రకాశ్ రాజ్, శుభలేఖ సుధాకర్, రావు రమేష్ వంటి సీనియర్ నటీనటులు కీలక పాత్రల్లో నటించడం వల్ల కథలో బరువు పెరిగింది. నేహా శెట్టి ప్రత్యేక గీతంలో అలరిస్తుండగా, డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మాణం ఈ చిత్రానికి మరో బలమైన ప్లస్‌గా మారింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు, పాటలు ప్రేక్షకుల్లో భారీ హైప్ క్రియేట్ చేశాయి.
ఈ సినిమా కథ, స్క్రీన్‌ప్లే, యాక్షన్ ఎలిమెంట్స్ అన్నీ పవన్ కళ్యాణ్ స్టార్‌డమ్‌ను మరో స్థాయికి తీసుకెళ్తాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. దసరా కానుకగా సెప్టెంబర్ 25న ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి. పండగ సీజన్ కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యువత కూడా థియేటర్స్ వైపు ఆకర్షితులు కానున్నారు. పవన్ కళ్యాణ్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించడం ఇదే మొదటిసారి కావడంతో, ఆయన లుక్, స్టైల్, మాస్ యాక్షన్ సన్నివేశాలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకోనున్నాయి. ఓజీ విజయవంతమైతే ఇది పవన్ కళ్యాణ్ నటనతో పాటు ఆయన రాజకీయ ప్రస్థానానికీ పాజిటివ్ ఇంపాక్ట్ ఇస్తుందని సినీ, రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.