HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Radha Madhavam Is A Good Informative Film Director Dasari Issaku

Radha Madhavam: ‘రాధా మాధవం’ మంచి సందేశాత్మక చిత్రంగా నిలుస్తుంది: దర్శకుడు దాసరి ఇస్సాకు

  • Author : Balu J Date : 28-02-2024 - 11:33 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Radha Madhavam
Radha Madhavam

Tollywood: రాధా మాధవం’ మంచి సందేశాత్మక చిత్రంగా నిలుస్తుంది.. దర్శకుడు దాసరి ఇస్సాకు వినాయక్ దేశాయ్, అపర్ణా దేవీ హీరో హీరోయిన్లుగా గోనాల్ వెంకటేష్ నిర్మించిన అందమైన ప్రేమ కథా చిత్రం ‘రాధా మాధవం’. ఈ మూవీకి దాసరి ఇస్సాకు దర్శకత్వం వహించారు. వసంత్ వెంకట్ బాలా ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలను అందించారు. ఇప్పటికే రాధా మాధవం సాంగ్, టీజర్, ట్రైలర్ ఇలా అన్నీసినిమాపై పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేశాయి.

ఈ చిత్రం మార్చి 1న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా దర్శకుడు దాసరి ఇస్సాకు మీడియాతో ముచ్చటించారు. ఆయన పంచుకున్న విశేషాలివే.. చిన్నతనం నుంచే సినిమాల మీద ఆసక్తి ఉండేది. అందుకే ఇంట్లోంచి పారిపోయి హైద్రాబాద్‌కు వచ్చాను. ఇక్కడే ఏదో ఒక పని చేసుకుంటూ సినిమాల్లో ప్రయత్నాలు చేస్తుండేవాడిని. ఎడిటింగ్, కెమెరా ఇలా అన్ని డిపార్ట్మెంట్‌లలో పని చేశాను. దర్శకత్వం మీదున్న ఆసక్తితో అన్నపూర్ణ ఇన్‌స్టిట్యూట్‌లో చేరాను. దాని కోసం పార్ట్ టైం జాబ్ చేస్తూ డబ్బులు కూడబెట్టుకునేవాడిని. అలా అన్నపూర్ణ ఇన్‌స్టిట్యూట్ నుంచి దర్శకత్వ శాఖలో ట్రైనింగ్ తీసుకుని బయటకు వచ్చాను. 2019లో తెలిసిన ఓ స్నేహితుడి ద్వారా నిర్మాత గోనాల్ వెంకటేష్ గారు పరిచయం అయ్యారు. ఆహా కోసం ఓ సినిమాను తీయాలని ముందుగా మేం కలిసి పని చేశాం. కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఆ తరువాత నిర్మాత ఈ రాధా మాధవం కథను నాకు చెప్పారు.

రైటర్ వసంత్ రాసిన ఈ కథను నాకు వినిపించడంతో బాగా నచ్చింది. అలా ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాం. వినాయక్ దేశాయ్ నాకు ఎప్పటి నుంచో పరిచయం. మేం జిమ్ మేట్స్‌. వినాయక్ కటౌట్ బాగుంటుందని ఈ సినిమాకు తీసుకున్నాం. అయితే హీరోయిన్ కోసం చాలా వెదికాం. హీరో ఎత్తుకు సరిపోయేలా ఉండాలని చూశాం. కానీ అపర్ణా దేవీ యాక్టింగ్ బాగుంటుందని, హైట్ తక్కువైనా పర్లేదని ఆమెను తీసుకున్నాం. మేక రామకృష్ణ గారికి ఈ కథ చాలా నచ్చింది. విన్న వెంటనే ఓకే చేశారు. రాధా మాధవం పాటలు, టీజర్, ట్రైలర్‌లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. వాటితో మా సినిమా మీద బజ్‌ పెరిగింది. మా చిత్రంపై ఇంతటి పాజిటివ్ రెస్పాన్స్ చూసి నాకు చాలా ఆనందమేసింది.

మ్యూజిక్ డైరెక్టర్ కొల్లి చైతన్య గారు మంచి పాటలు ఇచ్చారు. ఆర్ఆర్ కూడా అద్భుతంగా ఉంటుంది. రాధా మాధవం సినిమా కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం. ఫ్యామిలీ మెచ్చే అంశాలతో పాటు యూత్‌ను అట్రాక్ట్ చేసే ప్రేమ సన్నివేశాలు కూడా ఉంటాయి. ప్రేమతో పాటు మంచి సందేశాన్నిచ్చేలా రాధా మాధవం సినిమాను తెరకెక్కించాం. థియేటర్లో మంచి సినిమాను చూశామనే ఫీలింగ్‌తో ఆడియెన్స్ బయటకు వచ్చేస్తారు. మార్చి 1న రాబోతోన్న మా చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • first interview
  • Radha Madhavam
  • tollywood
  • tollywood latest news

Related News

I will only do such films from now on... Kajal's sensational decision.

Kajal Aggarwal: ఇకపై అలాంటి సినిమాలే చేస్తా.. కాజల్ సంచలన నిర్ణయం

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ తన సినీ ప్రయాణంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా హీరోయిన్లు పెళ్లయ్యాక, తల్లి అయ్యాక సినిమాలకు దూరం అవుతుంటారు లేదా గ్లామర్ పాత్రలకే పరిమితమవుతుంటారు. కానీ, కాజల్ మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు. మాతృత్వం పొందిన తర్వాత తన ఆలోచనా విధానంలో, కథల ఎంపికలో పూర్తి మార్పు వచ్చిందని ఆమె స్పష్టం చేశారు. ఇకపై తాను చేసే ప

    Latest News

    • 900 Snakes: చైనా వరదల కారణంగా తప్పించుకున్న దాదాపు 900 పాములు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి, పాముకాటు ఘటనలు పెరుగుతున్నాయి.

    • Diamond Lotus: అంతరిక్షంలోకి ల్యాబ్‌-గ్రోన్‌ వజ్ర కమలం చరిత్ర సృష్టించనుంది..!

    • Lenin Review: అఖిల్ అక్కినేని లెనిన్ సినిమా రివ్యూ

    • Medicines Prices: సామాన్యుడికి భారీ ఉపశమనం.. 39 మందుల ధరలను నిర్ణయించిన ప్రభుత్వం

    • Kadapa: బ్రహ్మణి స్టీల్స్ భూములు పై ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd