Pushpa: ‘బాహుబలి’ రికార్డ్ ఔట్.. ప్రభాస్ ను అధిగమించిన బన్నీ!
‘బాహుబలి' రికార్డ్ ఔట్.. ప్రభాస్ ను అధిగమించిన బన్నీ! దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన 'బాహుబలి' సినిమా భారత చలన చిత్ర పరిశ్రమకి సంబంధించిన దశనే మార్చేసిందనే చెప్పాలి.
- By Hashtag U Published Date - 09:04 PM, Wed - 26 January 22
‘బాహుబలి’ రికార్డ్ ఔట్.. ప్రభాస్ ను అధిగమించిన బన్నీ!
దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ‘బాహుబలి’ సినిమా భారత చలన చిత్ర పరిశ్రమకి సంబంధించిన దశనే మార్చేసిందనే చెప్పాలి. కేవలం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ యొక్క రూపురేఖలు మాత్రమే కాకుండా ఆ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీ, అందులో నటించిన హీరో ప్రభాస్ స్థాయిని కూడా అమాంతం పెంచేసింది. వరల్డ్ వైడ్ గానే ‘బాహుబలి’ సినిమా అద్భత సినిమాగా కీర్తిగడించింది. అలాంటి ‘బాహుబలి’ సినిమా సృష్టించిన రికార్డులను రీసెంట్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ”పుష్ప” కొన్నిచోట్లా బ్రేక్ చేసింది.
‘బాహుబలి’ సినిమా మలయాళం ఇండస్ట్రీ లో క్రియేట్ చేసిన అతి పెద్ద రికార్డును, తాజాగా అల్లు అర్జున్ మూవీ ”పుష్ప” అధిగమించినట్లు ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. మరోవైపు ఎలాంటి హడావిడి లేకుండానే బాలీవుడ్ ఇండస్ట్రీలో ”పుష్ప” సినిమా, అక్కడ హీరోలకు ధీటుగా కలెక్షన్స్ సాధిస్తోంది. మరోపక్క సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా అదే రీతిలో కలెక్షన్లు సాధిస్తూ ఉండటంతో బన్నీ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళలో కూడా ‘పుష్ప’ భారీ ఎత్తున కలెక్షన్లు సాధిస్తోంది. భారత క్రికెట్ ఆటగాళ్లతో పాటు డేవిడ్ వార్నర్ లాంటి వాళ్లు కూడా ‘పుష్ప’ సినిమా లోని తగ్గేదేలే అనే డైలాగ్ తో సోషల్ మీడియాలో వీడియోల రూపంలో మనకి దర్శనమిస్తున్నారు.
దీంతో బన్నీ సినిమా ‘పుష్ప’ కి ఇంటర్నేషనల్ లెవల్ లో ప్రమోషన్ కూడా వస్తోంది. దీంతో బాహుబలి సినిమా రికార్డులను అక్కడక్కడా బ్రేక్ చేస్తూ ప్రభాస్ కి చెమటలు పట్టించే రీతిలో అల్లు అర్జున్ పుష్పతో అతిపెద్ద విజయం అందుకున్నాడని ఆయన అభిమానులు తెగ సంబరపడుతున్నారు. ప్రస్తుతం ‘పుష్ప’ సినిమాతో బన్నీ కూడా తన ఇమేజ్ ను అమాంతం పెంచుకున్నాడని ఇండస్ట్రీలోని పెద్దలు సైతం అంటున్నారు. దీంతో దేశవ్యాప్తంగా పేరు గాంచిన నిర్మాణ సంస్థలు బన్నీతో సినిమాలు చేయడానికి క్యూ కడుతూ…. భారీ రెమ్యునరేషన్ ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి. ఇకపోతే లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కోసం రూ.100 కోట్ల ఆఫర్ ఇవ్వడానికి ముందుకు వచ్చినట్లు సమాచారం. లైకా సంస్థ బన్నీతో పాన్ ఇండియా నేపథ్యంలో ఓ సినిమా చేయడానికి మంతనాలు జరుపుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది.
Related News
Kannappa : కన్నప్ప మూవీలోకి మరో స్టార్ ఎంట్రీ.. ఈసారి అందాల భామ..
కన్నప్ప మూవీలోకి మరో స్టార్ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈసారి అందాల భామ..