Allu Arjun Rejected 10 Crores Offer : 10 కోట్ల ఆఫర్ రిజెక్ట్ చేసిన పుష్ప రాజ్..!
Allu Arjun Rejected 10 Crores Offer ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. అంతకుముందు వరకు సౌత్ హీరోగా
- Author : Ramesh
Date : 01-06-2024 - 11:53 IST
Published By : Hashtagu Telugu Desk
Allu Arjun Rejected 10 Crores Offer ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. అంతకుముందు వరకు సౌత్ హీరోగా మాత్రమే గుర్తింపు ఉన్న అల్లు అర్జున్ పుష్ప 1 తో నేషనల్ లెవెల్ లో సత్తా చాటాడు. బీ టౌన్ ఆడియన్స్ కి పుష్ప రాజ్ మాస్ యాటిట్యూడ్ బాగా ఎక్కడంతో సినిమాను ఆ రేంజ్ హిట్ చేశారు. ప్రస్తుతం పుష్ప 2 తో మరోసారి బాక్సాఫీస్ పై సమరానికి సిద్ధం అవుతున్నాడు అల్లు అర్జున్.
పుష్ప 1తో పాపులారిటీ వైజ్ గా కూడా అల్లు అర్జున్ గ్లోబల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అందుకే వాణిజ్య ప్రకటనల కోసం కూడా అల్లు అర్జున్ ని సంప్రదిస్తున్నారు. ఐతే లేటెస్ట్ గా పుష్ప రాజ్ అదే మన అల్లు అర్జున్ ఒక యాడ్ ని చేయనని చెప్పేశాడట. నిమిషం యాడ్ చేస్తే 10 కోట్లు రెమ్యునరేషన్ ఇస్తానన్నా సరే అల్లు అర్జున్ కాదనేశాడట.
ఇంతకీ అల్లు అర్జున్ ఆ యాడ్ చేయకపోవడానికి కారణం ఏంటంటే అది టుబాకోకి సంబందించిందని తెలుస్తుంది. టుబాకో ప్రకటన చేస్తే తన ఫ్యాన్స్ కూడా దాన్ని ఫాలో అవుతారనే మంచి ఉద్దేశంతో అల్లు అర్జున్ ఆ ప్రకటనను చేయనని చెప్పేశాడట. అల్లు అర్జున్ కమర్షియల్ కాదని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. కేవలం డబ్బు కోసం ఎలాంటి ప్రకటనలైనా చేస్తుంటారు కానీ అల్లు అర్జున్ టుబాకో యాడ్ చేయకుండా తన మంచి మనసుని చాటుకున్నాడు.
Also Read : Prabhas : సలార్ 2 అటకెక్కిందా.. రెబల్ ఫ్యాన్స్ ని కంగారు పెట్టిస్తున్న లేటెస్ట్ న్యూస్..!