Pushpa Last Shoot : పుష్ప ముగిసింది…పుష్పరాజ్ ట్వీట్
Pushpa 2 : గత ఐదేళ్లుగా పుష్ప టీం తో ట్రావెల్ చేస్తూ వస్తున్న బన్నీ..ఈరోజు చివరి షూట్ పూర్తి చేసి ఎమోషనల్ అయ్యాడు. ఐదేళ్ల పుష్ప ప్రయాణం ముగిసిందని వెల్లడించాడు. పుష్పకు సంబంధించి చివరి రోజు... చివరి షాట్... ఎంత అద్భుతమైన ప్రయాణం అని పేర్కొన్నాడు.
- By Sudheer Published Date - 08:27 PM, Tue - 26 November 24

నేటితో పుష్ప ఘట్టం ముగిసిందంటూ ఎమోషనల్ పోస్ట్ చేసాడు బన్నీ. అల్లు అర్జున్ – సుకుమార్ కలయికలో పుష్ప సిరీస్ తెరకెక్కిన సంగతి తెలిసిందే. గత ఐదేళ్లుగా పుష్ప టీం తో ట్రావెల్ చేస్తూ వస్తున్న బన్నీ..ఈరోజు చివరి షూట్ పూర్తి చేసి ఎమోషనల్ అయ్యాడు. ఐదేళ్ల పుష్ప ప్రయాణం ముగిసిందని వెల్లడించాడు. పుష్పకు సంబంధించి చివరి రోజు… చివరి షాట్… ఎంత అద్భుతమైన ప్రయాణం అని పేర్కొన్నాడు. ఈ మేరకు చిత్రీకరణకు సంబంధించిన ఆన్ లొకేషన్ ఫొటోను కూడా పంచుకున్నాడు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – నేషనల్ క్రాష్ రష్మిక (Allu Arjun-Rashmika) జంటగా..లెక్కల మాస్టర్ సుకుమార్ (Sukumar) డైరెక్షన్లో తెరకెక్కిన మూవీ పుష్ప 2 (Pushpa 2). మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ పాన్ ఇండియా మూవీ డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాగా ఈ సినిమాకు సంబదించిన చివరి షూట్ ఈరోజు పూర్తి అయ్యింది. ఈ విషయాన్నీ అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఐదేళ్ల పుష్ప ప్రయాణం ముగిసిందని …పుష్పకు సంబంధించి చివరి రోజు… చివరి షాట్… ఎంత అద్భుతమైన ప్రయాణం అని , ఈ మేరకు చిత్రీకరణకు సంబంధించిన ఆన్ లొకేషన్ ఫొటోను అల్లు అర్జున్ పంచుకున్నాడు.
ఇక ఈ సినిమాను 3 గంటల 15 నిమిషాల నిడివి(Pushpa 2 Runtime)తో విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో మూడు గంటల పాటు థియేటర్స్ లలో ప్రేక్షకులను కూర్చుబెట్టాలంటే కత్తిమీద సామే..కథలో దమ్ము ఉంటె తప్ప మూడు గంటలు అనేది వర్క్ అవుట్ కాదు..అలాంటిది సుకుమార్ ఏకంగా 3 గంటల 15 నిమిషాల నిడివితో పుష్ప 2 ను ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నాడంటే..అది ఆశ్చర్యపోవాల్సిన విషయమే.
కథ ఏమాత్రం తేడకొట్టిన ఆ దెబ్బ నిడివి పై ఖచ్చితంగా పడుతుంది. పుష్ప పార్ట్ 1 మూడు గంటల లోపు నిడివితో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2 గంటల 59 నిమిషాల నిడివితో వచ్చిన పుష్ప బాక్సాఫీస్ వద్ద సెన్షేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు పుష్ప 2 పై అంచనాలు అంతకు మించి అన్నట్లుగా ఉండబోతుందని ఈ నిడివి వార్త చెప్పకనే చెపుతుంది. నిడివి ఎక్కువ అయినా పర్లేదు అని సుకుమార్ ప్రయోగం చేస్తున్నాడట. మరి ఇక్కడి ఆడియెన్స్ కోసం ఏమైనా తగ్గిస్తాడా? లేదా? అదే నిడివితో వదులుతాడా? అన్నది చూడాలి. తాజాగా విడుదలైన కిస్ సాంగ్ మాత్రం అభిమానులను అంత అలరించలేకపోయింది. పుష్ప 1 లో ఊ కొట్టే రేంజ్ లో కిస్ సాంగ్ అనేది లేదు. మరి మిగతా సాంగ్స్ ఎలా ఉంటాయో చూడాలి.
LAST DAY LAST SHOT OF PUSHPA . 5 years JOURNEY of PUSHPA completed . What a journey 🖤 pic.twitter.com/eQoRhcLFMQ
— Allu Arjun (@alluarjun) November 26, 2024
Read Also : CM Revanth Reddy Request: బాపూ ఘాట్ అభివృద్ధికి 222.27 ఎకరాలు బదిలీ చేయండి.. సీఎం రేవంత్ రెడ్డి వినతి!