Pushpa 2 Special Song : పుష్ప 2లో స్పెషల్ సాంగ్ హీరోయిన్ ఫిక్స్.. రచ్చ రంబోలా గ్యారెంటీ..?
Pushpa 2 Special Song ఐటం సాంగ్ కోసం బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ ని అడిగారట. ఐతే ఈ సాంగ్ కోసం ఆమె భారీ రెమ్యునరేషన్ అడగిందట. అయినా సరే ఆమె అడిగినంత ఇచ్చి తీసుకుందాం అనేసరికి డేట్స్
- By Ramesh Published Date - 01:27 PM, Sat - 2 November 24

Pushpa 2 Special Song సుకుమార్ అల్లు అర్జున్ (Allu Arjun) కాంబోలో వస్తున్న పుష్ప 2 డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేశారు. సినిమాకు ఉన్న బజ్ చూస్తుంటే పాన్ ఇండియా లెవెల్ లో పుష్ప రాజ్ హంగామా ఒక రేంజ్ లో ఉండేలా ఉంది. ఐతే పుష్ప 1 లో స్పెషల్ సాంగ్ గా సమంత చేసిన ఉ అంటావా సాంగ్ అదరగొట్టేసింది. పుష్ప 2 లో స్పెషల్ సాంగ్ (Special Song) ఎవరు చేస్తారన్నది ఇంకా నిర్ణయించలేదు.
బాలీవుడ్ హీరోయిన్ తో సంప్రదింపులు చేసినట్టు తెలుస్తుండగా ఇప్పుడు మళ్లీ టాలీవుడ్ భామతోనే పుష్ప 2 సాంగ్ చేస్తున్నారని తెలుస్తుంది. పుష్ప 2 లో ఐటం సాంగ్ కోసం బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ ని అడిగారట. ఐతే ఈ సాంగ్ కోసం ఆమె భారీ రెమ్యునరేషన్ అడగిందట. అయినా సరే ఆమె అడిగినంత ఇచ్చి తీసుకుందాం అనేసరికి డేట్స్ కూడా కావాల్సినన్ని ఇచ్చేందుకు ఇబ్బంది ఉందట. అందుకే శ్రద్ధాని కాదనుకున్నారు.
అల్లు అర్జున్ ని మ్యాచ్ చేస్తూ..
ఇక ఆ ప్లేస్ లో డ్యాన్స్ లో అదరగొట్టేస్తున్న శ్రీలీలను తీసుకున్నట్టు తెలుస్తుంది. శ్రీలీల (Srileela) ఐతే పుష్ప 2 స్పెషల్ సాంగ్ కి పర్ఫెక్ట్ అని మేకర్స్ నమ్ముతున్నారు. అందుకే ఆమెతోనే ఈ సాంగ్ చేయించాలని ఫిక్స్ అయ్యారట. డ్యాన్స్ లో శ్రీలీల స్పీడ్ ఇంకా గ్రేస్ తెలిసిందే. అల్లు అర్జున్ ని మ్యాచ్ చేస్తూ పుష్ప 2 లో శ్రీలీల సాంగ్ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని చెప్పొచ్చు.
పుష్ప 2 (Pushpa 2) లో దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది. రష్మికతో పాటు శ్రీలీల కూడా పుష్ప 2 కి మరింత గ్లామర్ తీసుకొస్తుందని చెప్పొచ్చు.
Also Read : Matka Trailer : వరుణ్‌తేజ్ ‘మట్కా’ ట్రైలర్ అదిరింది..!