Pushpa 2 Movie First Review : ‘పుష్ప 2’ ఫస్ట్ రివ్యూ వచ్చేసిందోచ్..ఇక తగ్గేదేలే
Pushpa 2 Movie First Review : ‘ ఈ శీతాకాలంలో వరల్డ్ వైడ్‌గా వైల్డ్ ఫైర్ ఖాయం. పుష్ప 2 పైసా వసూల్ బ్లాక్ బస్టర్ ఎంటర్ టైనర్. సుకుమార్ దర్శకత్వ ప్రతిభకు అద్ధం పట్టే చిత్రం ఇది. అల్లు అర్జున్ నెంబర్ 1 పాన్ ఇండియా స్టార్ అనిపించాడు
- By Sudheer Published Date - 01:44 PM, Wed - 4 December 24

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – నేషనల్ క్రాష్ రష్మిక (Allu Arjun-Rashmika) జంటగా..లెక్కల మాస్టర్ సుకుమార్ (Sukumar) డైరెక్షన్లో తెరకెక్కిన మూవీ పుష్ప 2 (Pushpa 2). మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ పాన్ ఇండియా మూవీ కాసేపట్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీ పై ఎలాంటి అంచనాలు నెలకొని ఉన్నాయో మాటల్లో చెప్పలేం..దీనికి ఉదాహరణే అడ్వాన్స్ బుకింగ్ తో వచ్చిన రూ 100 కోట్లు. ఇది చాలు సినిమాపై ప్రేక్షకులు ఎంత ఆసక్తి తో ఉన్నారో..ఇప్పటికే పాటలు దుమ్ములేపడం..ట్రయిలర్ , టీజర్ , ప్రమోషన్ ఇలా ప్రతిదీ తగ్గేదేలే అనిపించేలా ఉండడం తో సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్నారు.
ఈ క్రమంలో ఈ సినిమా రివ్యూ , రేటింగ్ ను తెలిపి మరోసారి వైరల్ గా మారారు మూవీ క్రిటిక్ ఉమైర్ సంధు(Umair Sandhu). పుష్ప 2 క్లాసీ బ్లాక్ బస్టర్ అంటూ నాలుగు స్టార్లు వేసేశారు. ఈ శీతాకాలంలో వరల్డ్ వైడ్‌గా వైల్డ్ ఫైర్ ఖాయం. పుష్ప 2 పైసా వసూల్ బ్లాక్ బస్టర్ ఎంటర్ టైనర్. సుకుమార్ దర్శకత్వ ప్రతిభకు అద్ధం పట్టే చిత్రం ఇది. అల్లు అర్జున్ నెంబర్ 1 పాన్ ఇండియా స్టార్ అనిపించాడు. అంతేకాదు.. పుష్ప 2 హిట్‌ని చూసి అసూయ పడకండి. పుష్ప 2కి మద్దతు ఇవ్వండి. అల్లు అర్జున్ గురించి కొంతమంది ఎందుకు నెగిటివిటీని ప్రచారం చేస్తున్నారంటే.. జనం అతన్ని అమితంగా ప్రేమిస్తున్నారు’ అంటూ వరుస ట్వీట్లు వేశాడు.
ఈ మూవీ బ్లాక్ బస్టర్ పైసా వసూల్ ఎంటర్టైనర్ అని అతడు అన్నాడు. సినిమాలోని ఇంటర్వెల్, క్లైమ్యాక్స్ హైలైట్ అని.. అల్లు అర్జున్ కు మరో నేషనల్ అవార్డు ఖాయమని కూడా అనడం విశేషం. రష్మిక మందన్నా, ఫహాద్ ఫాజిల్ నటనను కూడా ఉమేర్ ఆకాశానికెత్తాడు. సెస్, మాసెస్ అందరూ మెచ్చే పైసా వసూల్, సీటీ మార్ ఎంటర్టైనర్ ఇది. బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ రికార్డులు బ్రేక్ చేయడం ఖాయం. ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలవనుంది అంటూ ఉమేర్ స్పష్టం చేశాడు. అలాగే రష్మిక చాలా బాగా చేసిందని , మూవీలో ఫహాద్ ఫాజిల్ నటన కూడా మరో లెవెల్ అని తెలిపాడు. పుష్ప ఫస్ట్ పార్ట్ చివర్లో వచ్చే ఈ మలయాళ నటుడు.. ఈ సీక్వెల్లో పూర్తి స్థాయిలో కనిపించనున్నాడు.క్లైమ్యాక్స్ ఈ మూవీలో ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇంటర్వెల్ బ్లాక్ మైండ్ బ్లోయింగ్. ఇండియన్ సినిమాలో గతంలో ఎప్పుడూ రాని ఓ భిన్నమైన మసాలా మూవీ ఇది” అని ఉమేర్ అన్నాడు.
ఉమేర్ ట్వీట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి..ఇదే క్రమంలో కొంతమంది ఉమేర్ ట్వీట్స్ పై ఖంగారుపడుతున్నారు. గతంలో ఉమేర్ పాజిటివ్ ఇచ్చిన సినిమాలు..బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి..సో ఇతడి ట్వీట్స్ ను పూర్తిగా నమ్మలేమని అంటున్నారు. చూద్దాం కాసేపట్లో ఏం జరుగుతుందో..!!
Read Also : Stella L ship : కాకినాడ షిప్ లో మరోసారి తనిఖీలు