Pushpa 2 : ఇక తగ్గేదేలే..’బాహుబలి-2′ రికార్డును బ్రేక్ చేసిన ‘పుష్ప-2’
Pushpa 2 : మాములుగా రిలీజ్ తర్వాత ఏ సినిమా అయినా రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది..కానీ పుష్ప 2 విషయంలో విడుదలకు ముందే గత చిత్రాల పేరుతో ఉన్న రికార్డ్స్ ను బ్రేక్ చేస్తూ తగ్గేదేలే అనిపిస్తుంది. ఆన్లైన్ టికెట్ ప్లాట్‌ఫామ్ బుక్ మై షో(Pushpa 2 Book My Show)లో 10 లక్షల టికెట్లు అత్యంత వేగంగా అమ్ముడుపోయిన చిత్రంగా నిలిచింది.
- By Sudheer Published Date - 09:55 PM, Tue - 3 December 24

ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా పుష్ప 2 (Pushpa2)మేనియా కొనసాగుతుంది. సినిమా రిలీజ్ కు కొద్దీ గంటల సమయం మాత్రమే ఉండడంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమాను చూద్దామా అనే ఆత్రుత అభిమానుల్లో పెరుగుతుంది. ఇదే క్రమంలో రికార్డ్స్ వేట కూడా మొదలైంది. మాములుగా రిలీజ్ తర్వాత ఏ సినిమా అయినా రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది..కానీ పుష్ప 2 విషయంలో విడుదలకు ముందే గత చిత్రాల పేరుతో ఉన్న రికార్డ్స్ ను బ్రేక్ చేస్తూ తగ్గేదేలే అనిపిస్తుంది. ఆన్లైన్ టికెట్ ప్లాట్‌ఫామ్ బుక్ మై షో(Pushpa 2 Book My Show)లో 10 లక్షల టికెట్లు అత్యంత వేగంగా అమ్ముడుపోయిన చిత్రంగా నిలిచింది. ఈ రికార్డు తో కల్కి, బాహుబలి-2, కేజీఎఫ్-2 వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల రికార్డ్స్ ను బ్రేక్ చేసినట్లు అయ్యింది. గతంలో ఈ రికార్డ్స్ ఆ చిత్రాల పేరుతో ఉండగా ..ఇప్పుడు వాటిని పుష్ప 2 వెనక్కు నెట్టింది.
కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా చిత్రానికి ఇప్పటికే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయని పుష్ప-2 టీం ప్రకటించింది. భారత సినీ చరిత్రలో ఈ స్థాయిలో విడుదలకు ముందే ఈ రేంజ్ రికార్డు సాధించిన సినిమా ఇదే అని చెప్పొచ్చు. అభిమానుల మద్దతు, పాన్-ఇండియా స్థాయిలో సినిమా మీదున్న క్రేజ్ కారణంగా ఇలాంటి ఫీట్ సాధ్యమైందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పుష్ప-2 టీం విడుదలకు ముందే ప్రొమోషన్స్‌లో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ, ప్రేక్షకుల ఉత్కంఠను మరింత పెంచింది. పాటలు, ట్రైలర్‌లతో సినిమా మీద ఆసక్తిని అమాంతం పెంచారు. ముఖ్యంగా, “పుష్ప” సరికొత్త స్టైల్, డైలాగ్‌లు యువతను విపరీతంగా ఆకర్షించాయి. ఈ సీక్వెల్‌లో అల్లు అర్జున్ నటనకు తోడు ఫాహద్ ఫాజిల్, రష్మిక మందన్న పాత్రలపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. మరి రేపు విడుదల తర్వాత ఇంకెన్ని రికార్డ్స్ సృష్టిస్తుందో చూడాలి.
Read Also : BuildNow Launched : హైదరాబాద్ నగర వాసులకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్